గత నెల ఆగస్ట్ ఓ కంపెనీ బైక్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 5 లక్షల రికార్డు అమ్మకాలను నమోదుచేసింది. ఇంతకూ ఆ వాహనాల తయారీ కంపెనీ ఏదో తెలుసా?
భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఆగస్టులో కొత్త మైలురాయిని అధిగమించింది. మొదటిసారిగా కేవలం ఒకే నెలలో ఈ కంపెనీ ఐదు లక్షలకు పైగా యూనిట్లను అమ్మింది. ఆగస్టులో టీవీఎస్ మొత్తం అమ్మకాలు 5,09,536 యూనిట్లు... ఇది 2024 ఆగస్టుతో పోలిస్తే 30% ఎక్కువ. 2024 ఆగస్టులో టీవీఎస్ 3,78,841 యూనిట్లు మాత్రమే అమ్మింది.
25
టివిఎస్ ఆల్ టైమ్ రికార్డు
ఈ ఆగస్ట్ అమ్మకాలే ఇప్పటివరకు టీవిఎస్ కంపెనీ అత్యధిక అమ్మకాల రికార్డు. 2024 ఆగస్ట్ లో టీవీఎస్ దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాలు 2,89,073 యూనిట్లు. అదే సమయంలో 2025లో 3,68,862 యూనిట్లు అమ్మింది, ఇది 28% వృద్ధి.
35
ఈ మూడు టివిఎస్ మోడల్స్ కు మంచి డిమాండ్
టివిఎస్ బైక్, స్కూటర్ అమ్మకాల గురించి చెప్పాలంటే… 30% వృద్ధితో మోటార్ సైకిల్ అమ్మకాలు 2,21,870 యూనిట్లు… స్కూటర్ అమ్మకాలు 36% వృద్ధితో 2,22,296 యూనిట్ల అమ్మకాలు జరిగాయట. అపాచీ సిరీస్, జూపిటర్, రైడర్ 125లకు ఉన్న డిమాండ్ కంపెనీ అమ్మకాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.
ఎలక్ట్రిక్ వాహనాల గురించి చెప్పాలంటే 2025 ఆగస్టులో 25,138 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. అదే సమయంలో 2024 ఆగస్టులో 24,779 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇటీవల, టీవీఎస్ లక్ష రూపాయల లోపు ధరకే కొత్త ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని మరింత బలోపేతం చేస్తుంది.
55
ఇప్పుడే ఇలావుండే రాబోయే పండగల సీజన్లో రికార్డుల మోతే...
ఈ అద్భుతమైన ప్రదర్శనను బట్టి టీవీఎస్ బైక్‌లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, త్రీ-వీలర్లు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అద్భుతంగా రాణిస్తున్నాయని రుజువు చేస్తుంది. పండుగ సీజన్ సమీపిస్తున్నందున టీవీఎస్ అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అలాంటప్పుడు రాబోయే నెలల్లో కంపెనీకి మరింత అమ్మకాలు వచ్చే అవకాశం ఉంది. 2025 ఆగస్టులో రికార్డ్ అమ్మకాలు ద్విచక్ర వాహన పరిశ్రమలో టీవీఎస్‌ను బలమైన కంపెనీగా నిలిపాయి.