ప్రస్తుతం అందుబాటులోకి ఉన్న అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఆటోమొబైల్ రంగంలో ఊహకందని మార్పులు తీసుకువస్తోంది. ఇలా ఈతరం కార్లలో వస్తున్న ఈ ADAS టెక్నాలజీ ఏమిటి? ఇది అందుబాటులో ఉన్న టాప్ 5 బడ్జెట్ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ ఆటోమొబైల్ రంగం చాలా వేగంగా వృద్ధిచెందుతోంది... ప్రపంచంలో ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన అది ఇండియాకు రావాల్సిందే. ముఖ్యంగా కార్ల విషయంలో అయితే టెక్నాలజీ అప్ డేట్ మరింత ప్రాధాన్యత కలిగింది... వినియోగదారులు విదేశాల్లో ఉండే అడ్వాన్సుడ్ టెక్నాలజీని కోరుకుంటున్నారు. అందుకే కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో కార్లను అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఇలా వచ్చిందే ఈ ADAS టెక్నాలజీ.
27
ఏమిటీ ADAS టెక్నాలజీ?
అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) టెక్నాలజీ ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కార్లకు మాత్రమే పరిమితం కాదు... చాలా సాధారణ కార్లలో కూడా ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. దీనివల్ల డ్రైవింగ్ సురక్షితంగా, సులభంగా మారింది. పూర్తిస్థాయిలో సెన్సార్లు, కెమెరాలు, సాప్ట్ వేర్లు కలిగివుండి సురక్షిత డ్రైవింగ్, పార్కింగ్ సహాయం చేయడమే ఈ ADAS టెక్నాలజీ ముఖ్యఉద్దేశం. క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి కలిగివుండి ప్రమాదాలను నివారిస్తుంది... తద్వారా కారే కాదు అందులోనివారు సురక్షితంగా ఉంటారు.
ఇండియాలో ప్రస్తుతం లెవల్-1, లెవల్-2 ADAS టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ADAS సేఫ్టీ ఫీచర్స్‌తో కారు కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే మీ కోసం ఐదు చవకైన కార్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటి ఫీచర్స్, ధర ఇతర సమాచారం తెలుసుకొండి.
37
హోండా సిటీ (Honda City)
ధర: రూ.12.84 లక్షలు - రూ.16.69 లక్షలు
ఫీచర్స్: మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో ఇది నమ్మకమైన కారు. ADAS (హోండా సెన్సింగ్) ఫీచర్ V, VX, ZX వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇంజిన్: ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (121hp) ఉంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్ వేరియంట్లు అందించబడుతున్నాయి.
ఫీచర్స్: ఇది కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ప్రసిద్ధ కారు. ఇందులో లెవల్-1 ADAS (ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, లేన్ అసిస్ట్ వంటివి) సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. దీని టాప్ వేరియంట్ SX(O)లో మాత్రమే ADAS ఫీచర్ ఉంది.
ఇంజిన్: ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (120hp) - MT/DCT, 1.5 లీటర్ డీజిల్ (116hp) - MT ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి.
57
హోండా అమేజ్ (Honda Amaze)
ధర: రూ.10.04 లక్షలు - రూ.11.24 లక్షలు
ఫీచర్స్: ఇండియాలో ADAS టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన కారు ఇది. సబ్-4 మీటర్ సెడాన్ సెగ్మెంట్‌లో ADAS ఫీచర్ పొందిన మొదటి కారు ఇదే. దీని టాప్ మోడల్ ZX వేరియంట్‌లో మాత్రమే ఈ ఫీచర్ లభిస్తుంది.
ఇంజిన్: ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (90hp) ఉంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.
67
మహింద్రా ఎక్స్యూవి 300 (XUV300)
ధర: రూ.12.62 లక్షలు - రూ.15.80 లక్షలు
ఫీచర్స్: ఇందులో లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. దీని AX5 L, AX7 L వేరియంట్లలో మాత్రమే ఈ ఫీచర్ లభిస్తుంది.
ఇంజిన్: 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (131hp) - MT/TC, 1.5 లీటర్ డీజిల్-MT ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి.
77
కియా సోనెట్ (Kia Sonet)
ధర: రూ.14.84 లక్షలు - రూ.15.74 లక్షలు
ఫీచర్స్: ఇది స్టైలిష్ SUV. ఇందులో లెవల్-1 ADAS ఫీచర్ GTX+, X-Line వేరియంట్లలో ఉంది.
ఇంజిన్: 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (120hp) - DCT ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ (116hp) - TC ఇంజిన్ వేరియంట్లు ఉన్నాయి.