Royal Enfield: బుల్లెట్ బైక్ కొనాలని ప్రతీ ఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే మైలేజ్ విషయంలో భయపడుతుంటారు. అలాంటి వాలరికి ఒక గుడ్ న్యూస్. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఈ బైక్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
భారతీయ రైడర్లలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇప్పుడు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బైక్స్ రంగంలో అడుగుపెట్టింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 4 కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో రెండు ఎలక్ట్రిక్, ఒక హైబ్రిడ్, ఒక హిమాలయన్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఉండనున్నాయి.
DID YOU KNOW ?
4 కొత్త మోడల్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇప్పుడు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బైక్స్ రంగంలో అడుగుపెట్టింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 4 కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది.
25
ఫ్లయింగ్ ఫ్లీ C6 – తొలి ఎలక్ట్రిక్ బైక్
మిలాన్ ఆటో ఎక్స్‌పోలో మొదటిసారి ఫ్లయింగ్ ఫ్లీ C6 కాన్సెప్ట్‌ను ప్రదర్శించారు. తరువాత ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లో ఈ మోడల్‌ను చూపించారు. లడఖ్ కఠిన వాతావరణంలో టెస్టులు పూర్తి చేసిన ఈ మోడల్‌ను త్వరలోనే EICMA షోలో ప్రొడక్షన్ వెర్షన్‌గా చూపించనున్నారు. నియో-రెట్రో డిజైన్‌తో కూడిన ఈ బైక్ L ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు.
35
ఫ్లయింగ్ ఫ్లీ S6 – ఆఫ్‌రోడ్ స్క్రాంబ్లర్
C6 తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో ఎలక్ట్రిక్ మోడల్ ఫ్లయింగ్ ఫ్లీ S6ను పరిచయం చేసింది. ఇది స్క్రాంబ్లర్ శైలిలో డిజైన్ చేశారు. ఆఫ్‌రోడ్ టైర్లు, స్పోక్డ్ వీల్స్‌తో ఈ మోడల్ లడఖ్‌లో రోడ్ టెస్టింగ్ పూర్తిచేసింది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో వచ్చే ఈ బైక్ 150–200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. పనితీరులో 350cc ఇంజిన్‌కు సమానమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఎలక్ట్రిక్ మోడల్స్‌తో పాటు, హైబ్రిడ్ బైక్‌ను కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేస్తోంది. కొత్తగా వస్తున్న 250cc హైబ్రిడ్ మోటార్‌సైకిల్ 50 kmpl కంటే ఎక్కువ మైలేజీ ఇవ్వగలదని సమాచారం. “V” కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌కు చైనాకు చెందిన CFMoto టెక్నికల్ సపోర్ట్ అందిస్తోంది. BS6 స్టేజ్ II నిబంధనలకు అనుగుణంగా డిజైన్ చేసిన ఈ బైక్ ధర దాదాపు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 2026 చివరి నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
55
హిమాలయన్ ఎలక్ట్రిక్ – HIM-E
ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్నది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వెర్షన్ (HIM-E). ఇది ఇప్పటివరకు బ్రాండ్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ అవుతుంది. 14kWh బ్యాటరీతో వస్తుందని, సుమారు 100bhp పవర్ ఇవ్వగలదని తెలుస్తోంది. లడఖ్‌లో టెస్టింగ్ జరుగుతున్న ఈ బైక్ 2026 మధ్య నాటికి అధికారికంగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది.