దీపావళి పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. టాటా, మారుతి లాంటి ప్రముఖ కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. ఏ కారుపై ఎంత ఆఫర్ ఉందో ఇక్కడ చూద్దాం.
దీపావళి పండక్కి చాలామంది కొత్తవాహనాాలు కొంటుంటారు. అందుకే ఈ పండగ సీజన్లో అన్ని వాహనాలపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఈసారి పండక్కి కొత్తకారు కొనాలనుకునేవారిని ఆకర్షించేందుకు టాటా, మారుతి, సిట్రోయెన్ లాంటి కంపెనీలు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించాయి. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్, ఎలక్ట్రిక్ కార్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఇస్తున్నాయి. ఈ లిస్ట్‌లో టాటా టియాగో ఈవీపై అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు ఆఫర్ ఉంది. అన్ని కార్లపై ఉన్న డిస్కౌంట్ల వివరాలు చూద్దాం.
25
టాటా టియాగో ఈవీ (TATA Tiago EV)
టియాగో ఈవీ పాత డిజైన్ మోడల్స్ కొనుగోలుపై టాటా కంపెనీ రూ.1.45 లక్షల వరకు లాభాలను అందిస్తోంది. ఇందులో రూ.లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.50 వేల స్పెషల్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ కింద మరో రూ.25 వేల వరకు ప్రయోజనాలు పొందొచ్చు.
ఈ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు 19 kWh, 24 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 293 కి.మీ రేంజ్ ఇస్తుందని ఏఆర్ఏఐ (ARAI) ధృవీకరించింది. దీని షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల మధ్య ఉంది. దీపావళి ఆఫర్లో ధర తగ్గుతుంది.
35
సిట్రోయెన్ సీ3 (Citroen C3)
ఫ్రాన్స్‌కు చెందిన సిట్రోయెన్ కంపెనీ తమ సీ3 కారుపై రూ.1.18 లక్షల వరకు ఆఫర్లను ఇస్తోంది. ఈ కారు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. నార్మల్ పెట్రోల్ ఇంజిన్ 82 hp పవర్, 115 Nm టార్క్‌ను ఇస్తుంది. టర్బో ఇంజిన్ 110 hp పవర్, 190 నుంచి 205 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.9.68 లక్షల వరకు ఉంది.
మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌పై కస్టమర్లు రూ.71 వేల వరకు లాభాలు పొందొచ్చు. ఇతర పెట్రోల్ వేరియంట్లపై రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.5 వేల అదనపు లాభాలు ఉన్నాయి. స్విఫ్ట్ కారు పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో దొరుకుతుంది.
మారుతి సెలెరియో కారుపై రూ.67,500 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రూ.40 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.2,500 అదనపు లాభాలు కలిసి ఉన్నాయి.
55
వ్యాగన్ ఆర్ (Maruti WagonR)
మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్‌పై రూ.67 వేల వరకు లాభాలు ఉన్నాయి. అలాగే రూ.38 వేల విలువైన అదనపు యాక్సెసరీస్, రూ.1,900 వరకు ఇతర లాభాలను కంపెనీ ఇస్తోంది. ఇంజిన్ ఆప్షన్‌ను బట్టి ఇతర వేరియంట్లపై రూ.57,500 వరకు ఆఫర్లు ఉన్నాయి. దీని షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.24 లక్షల మధ్య ఉంది. మోడల్, వేరియంట్, డీలర్ వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి ఈ ఆఫర్లు మారొచ్చు.