Honda Alpha: సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ రేంజ్.. మార్కెట్లోకి హోండా తొలి ఎలక్ట్రిక్ కారు

Published : Nov 04, 2026, 08:38 AM IST

Honda Alpha: ఇండియన్ మార్కెట్లోకి హోండా తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'హోండా ఆల్ఫా'ను 2026 డిసెంబర్ 2న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. 500 కి.మీ రేంజ్, బ్యాటరీ కెపాసిటీ, ఇతర ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

PREV
14
uax[e తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'హోండా ఆల్ఫా'

ఇండియన్ ఈవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు హోండా సిద్ధమైంది. 2025లో ప్రదర్శించిన '0 ఆల్ఫా' (0 Alpha) కాన్సెప్ట్ మోడల్‌కు ప్రొడక్షన్ వెర్షన్‌గా ఈ ఎస్‌యూవీని 2026 డిసెంబర్ 2న కంపెనీ అధికారికంగా లాంచ్ చేయనుంది.

మార్కెట్లోకి వచ్చేసరికి దీని పేరులోని '0'ను తీసేసి, కేవలం 'హోండా ఆల్ఫా' (Honda Alpha) పేరుతోనే అమ్మకానికి తీసుకురానున్నారు. గత కొద్ది నెలలుగా ఇండియన్ రోడ్లపై ఈ కారును హోండా తీవ్రంగా టెస్టింగ్ చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని అధికారికంగా సేల్స్‌కు తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

24
గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఇండియా

హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ తోషియుకి యానగిసావా (Toshiyuki Yanagisawa) ఈ కారు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇండియన్ కస్టమర్లకు మోడ్రన్ ఎలక్ట్రిక్ మొబిలిటీని అందించడమే హోండా ఆల్ఫా లక్ష్యమన్నారు. హోండా బ్రాండ్‌కు తగ్గ క్వాలిటీ, నమ్మకం, డ్రైవింగ్ అనుభూతిని ఈ కారు ఇస్తుందని ఆయన చెప్పారు.

భవిష్యత్తులో ఈ మోడల్‌కు ఇండియానే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారబోతోంది. హోండా ఎలక్ట్రిక్ ప్రయాణంలో ఇదొక పెద్ద మైలురాయి. ఇండియన్ మార్కెట్ మీద మాకున్న బలమైన నిబద్ధతకు ఇది నిదర్శనం అని ఆయన వివరించారు.

34
డిజైన్ ఎలా ఉండబోతోంది?

ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న స్పై ఫొటోలను బట్టి చూస్తే.. ఈ ప్రొడక్షన్ మోడల్ '0 ఆల్ఫా' కాన్సెప్ట్ డిజైన్‌కు చాలా దగ్గరగా ఉంది. కాన్సెప్ట్ మోడల్‌లో ఉన్నట్లే నిటారుగా ఉండే ఫ్రంట్, రియర్ డిజైన్‌ను ఇందులోనూ ఇచ్చారు. వెనుక అద్దం దగ్గర ఉండే టెయిల్ ల్యాంప్స్, మందపాటి సీ-పిల్లర్ (C-pillar) వంటి ఫీచర్లను అలాగే ఉంచారు. బంపర్ సెటప్ కూడా కాన్సెప్ట్ మోడల్ డిజైన్‌నే పోలి ఉంది.

44
బ్యాటరీ కెపాసిటీ, రేంజ్ వివరాలు

హోండా ఆల్ఫా ఎస్‌యూవీకి సంబంధించిన అధికారిక టెక్నికల్ వివరాలను కంపెనీ ఇంకా పూర్తిగా బయటపెట్టలేదు. అయితే, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric), మారుతి సుజుకి ఈ-విటారా (Maruti Suzuki e-Vitara) వంటి మోడళ్ల కంటే ఇది సైజులో పెద్దగా ఉంటుందని అంచనా. ఇందులో 50 నుంచి 70 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. సింగిల్ ఫుల్ ఛార్జ్‌తో రియల్ వరల్డ్ కండిషన్స్‌లో 400 నుంచి 500 కి.మీ రేంజ్ ఇచ్చేలా ఈ ఎస్‌యూవీని హోండా డిజైన్ చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories