తక్కువ ధ‌ర‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్-5 బైకులు

Published : Aug 16, 2025, 07:01 AM IST

Best Mileage Bikes: త‌క్కువ ధ‌ర‌లో అత్య‌ధిక మైలేజ్ ఇచ్చే బైకులు మార్కెల్ లో కొన్ని ఉన్నాయి. కేవ‌లం రూ. 90,000 లోపు ధరలో లభించే టాప్ 5 100cc బైకులు, అద్భుత మైలేజ్, ఇంజిన్ వివరాలు, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్ ఇచ్చే బైకులు

భారత మార్కెట్‌లో బైక్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు సాధారణంగా రెండు విషయాలపై దృష్టి పెడతారు. ధర, మైలేజ్. త‌క్కువ బడ్జెట్, అధిక మైలేజ్ కోరుకునే వారికి 100cc విభాగం ఒక మంచి ఎంపికగా ఉంటుంది.

ఈ విభాగంలో తక్కువ ధరలోనే అధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌లు రోజువారీ ప్రయాణాలకు, తక్కువ నిర్వహణ ఖర్చులతో అనుకూలంగా ఉంటాయి. వీటిలో ఇంజిన్ శక్తి తక్కువగా ఉన్నప్పటికీ, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దేశంలో అత్య‌ధిక మైలేజ్ తో త‌క్కువ ధ‌ర‌లో లభించే టాప్-5 బైకుల వివ‌రాలు మీకోసం.

26
1. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్

రూ. 90,000 లోపు అద్భుత మైలేజ్ ఇచ్చే బైకులలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ టాప్ లో ఉంది. ఈ మోడల్‌లో 97.2cc ఇంజిన్ ఉండ‌గా, ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ బైక్ లీటరుకు 73 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 

దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ. 83,029 వరకు ఉంటుంది. హీరో స్ప్లెండర్ ఎప్పటినుంచో భారత మార్కెట్‌లో నమ్మకమైన బైక్‌గా నిలిచింది. ఈ కొత్త మోడల్‌లో అధునాతన సాంకేతిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

36
2. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న బైకు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది. ఇది భారతీయ మార్కెట్‌లో అత్యంత సరసమైన బైకులలో ఒకటి. దీనిలో కూడా 97.2cc ఇంజిన్ ఉంది, ఇది లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 

ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 59,416 మాత్రమే. తక్కువ ధరలో మంచి మైలేజ్ కావాలనుకునే వారికి ఇది ఒక సూప‌ర్ ఎంపిక. దీని డిజైన్ చాలా సాధారణంగా ఉన్నా, విశ్వసనీయతకు, తక్కువ నిర్వహణ ఖర్చులతో మంచి గుర్తింపు పొందింది.

46
3. హోండా షైన్ 100

ఈ లిస్టులో మూడవ స్థానంలో ఉన్న బైకు హోండా షైన్ 100. ఇది 98.98cc ఇంజిన్‌తో వస్తుంది, ఇది లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.69,171. హోండా కంపెనీ ఇంజిన్‌ల నాణ్యత, విశ్వసనీయత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

హోండా షైన్ సిరీస్ బైక్‌లు ఇప్పటికే మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. తక్కువ బడ్జెట్‌లో హోండా బ్రాండ్ నాణ్యతతో బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

56
4. హీరో స్ప్లెండర్ ప్లస్

ఈ జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్న బైకు హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే మోడల్‌లలో ఒకటి. దీనిలో 97.2cc ఇంజిన్ ఉంది, ఇది లీటరుకు 62 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,121. ఇది చాలా సంవత్సరాలుగా మార్కెట్‌లో తన పట్టును నిలుపుకుంది. దీని విశ్వసనీయత, సాధార‌ణ డిజైన్, త‌క్కువ‌ నిర్వహణ ఖ‌ర్చుల కార‌ణంగా చాలా మందికి ఇది ఒక మంచి ఎంపిక‌గా ఉంది.

66
5. హీరో ప్యాషన్ ప్లస్

చివరగా ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న బైకు హీరో ప్యాషన్ ప్లస్. ఇది 97.2cc ఇంజిన్‌తో వస్తుంది, ఇది లీటరుకు 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.81,837. 

ఈ బైక్ స్టైలిష్ లుక్, ఆధునిక డిజైన్‌తో యువతను ఆకర్షిస్తుంది. మంచి మైలేజ్‌తో పాటు, కొద్దిగా స్టైల్, మంచి పనితీరు కావాలనుకునే వారికి ఈ మోడల్ ఒక మంచి ఎంపికగా ఉంది. .

ఈ ఐదు బైక్‌లు తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్, మంచి పనితీరుతో మీకు మంచి రైడింగ్ అనుభ‌వాన్ని అందిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories