మీరు కొనాలనుకున్న కారు ఎంత ధర పడుతుందో ముందుగా తెలుసుకోండి. మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు లెక్కించుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. కారు ఖరీదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ వంటి వివరాలను వివరంగా తెలుసుకోండి. మీ దగ్గర ఎంత మొత్తం ఉందో.. ఇంకా ఎంత డబ్బు సమకూర్చుకోవాలో చూసుకోండి.
ఆదాయం పెంచుకోండి
డ్రీమ్ కారు ఖరీదు మీ బడ్జెట్ కంటే ఎక్కువైతే, ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపారం చేయండి. లేదా పార్ట్ టైం జాబ్ చేయడానికి ప్రయత్నించండి.