Top 3 Electric Bikes : 155 కి.మీ టాప్ స్పీడ్, 343 కి.మీ రేంజ్.. బడ్జెట్ ధరలో బెస్ట్ స్పోర్టీ ఈ-బైక్స్ ఇవే

Published : Nov 04, 2026, 05:03 PM IST

2026లో ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్న టాప్ 3 ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే. అల్ట్రావయలెట్ ఎక్స్47 వెనమ్, అల్ట్రావయలెట్ ఎఫ్77, ఒబెన్ రోర్ ఎవో బైక్‌ల ఫీచర్లు, ధరల వివరాలు ఇక్కడ చూద్దాం.

PREV
14
ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ లిస్ట్

ఇండియాలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ముఖ్యంగా ఈ-బైక్స్ సెగ్మెంట్ వేగంగా మారుతోంది. లేటెస్ట్ బ్యాటరీ టెక్నాలజీ, అదిరిపోయే పెర్ఫార్మెన్స్, స్పోర్టీ లుక్స్‌తో కొత్త బైక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలా 2026లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారి కోసం బెస్ట్ టాప్ 3 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి.

24
అల్ట్రావయలెట్ ఎక్స్47 వెనమ్ (Ultraviolette X47 Venom)

అల్ట్రావయలెట్ కంపెనీ నుంచి వస్తున్న ఎక్స్47 వెనమ్ మోడల్ స్పోర్టీ క్రాస్ఓవర్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. స్పీడ్, టెక్నాలజీ కోరుకునే రైడర్ల కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

మోటార్ - 30 kW మోటార్

టాప్ స్పీడ్ - గంటకు 155 కి.మీ

రేంజ్ - బ్యాటరీ వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛార్జ్‌పై 227 కి.మీ నుంచి 343 కి.మీ వరకు.

ప్రారంభ ధర - సుమారు రూ.2.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ఎవరు కొనొచ్చు?

అదిరిపోయే పెర్ఫార్మెన్స్, లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

34
అల్ట్రావయలెట్ ఎఫ్77 (Ultraviolette F77)

స్పీడ్ లవర్స్ కోసం అల్ట్రావయలెట్ తీసుకొచ్చిన మరో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ ఎఫ్77. అగ్రెసివ్ లుక్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఇది మార్కెట్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.

మోటార్ - వేరియంట్‌ను బట్టి 30 kW వరకు పవర్ ఇస్తుంది.

టాప్ స్పీడ్ - గంటకు 155 కి.మీ

స్టాండర్డ్ మోడల్ రేంజ్ - 211 కి.మీ

రికాన్ (Recon) మోడల్ రేంజ్ - 323 కి.మీ

ప్రారంభ ధర - సుమారు రూ.3.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ఎవరు కొనొచ్చు?

స్పోర్టీ రైడింగ్, ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

44
ఒబెన్ రోర్ ఎవో (Oben Rorr Evo)

లక్షలు ఖర్చు చేయకుండా, బడ్జెట్ ధరలో స్పోర్టీ లుక్ ఉన్న ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారి కోసం ఒబెన్ రోర్ ఎవో మోడల్ వచ్చింది.

మోటార్ - 9 kW మోటార్

టాప్ స్పీడ్ - గంటకు 110 కి.మీ

రేంజ్ - ఫుల్ ఛార్జ్ చేస్తే 180 కి.మీ వరకు

ప్రారంభ ధర - సుమారు రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ఎవరు కొనొచ్చు?

రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, బడ్జెట్ కస్టమర్లకు ఇది అద్భుతమైన ఆప్షన్.

Read more Photos on
click me!

Recommended Stories