Tata altroz facelift: రూ. 13 వేల EMIతో ఈ స్ట‌న్నింగ్ కారును సొంతం చేసుకోండి.. డౌన్ పేమెంట్ ఎంతంటే

Published : Jun 02, 2025, 05:59 PM IST

కారు కొనుగోలు చేయాల‌ని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఒక్క‌సారి పెద్ద మొత్తంలో డ‌బ్బులు చెల్లించాల‌న్న కార‌ణంతో వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే త‌క్కువ ఈఎమ్ఐతో లేటెస్ట్, హైఎండ్ కారు ఒక‌టి అందుబాటులో ఉంది.

PREV
15
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్

టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ అయిన ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్ వెర్షన్‌ను 2025 మే 23న విడుదల చేసింది. ఈ మోడల్‌లో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో పాటు మెరుగైన మైలేజ్ సామర్థ్యంతో మార్కెట్‌లోకి వచ్చింది. కారు లుక్స్, ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ విష‌యంలో రాజీప‌డ‌లేదు.

25
ధ‌ర ఎంత‌.? ఫైనాన్స్ వివ‌రాలు

టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ డీజిల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.99 లక్షలుగా ఉంది. ఆన్‌రోడ్ విష‌యానికొస్తే ఢిల్లీలో ఈ కారు ధ‌ర రూ. 10.15 లక్షలుగా ఉంది. దీనికి అద‌నంగా రిజిస్ట్రేష‌న్ రూ. 72,000, ఇన్సూరెన్స్ కోసం రూ. 45,000 చెల్లించాల్సి ఉంటుంది.

35
ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి.?

ఈ కారు సొంతం చేసుకోవాలంటే రూ. 2 ల‌క్ష‌ల డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ. 8.15 లక్షలు రుణంగా తీసుకోవాల్సి వస్తుంది. బ్యాంకు 7 సంవత్సరాల కాలానికి 9% వడ్డీ రేటు కలిగిన రుణాన్ని మంజూరు చేస్తే మీరు నెల‌కు రూ. 13,126 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం వడ్డీ రూ. 2,86,584 అవుతుంది. దీంతో మీరు ఈ కారుకు మొత్తం రూ. 13,01,584 అవుతుంది.

45
కారు డిజైన్‌

కొత్త ఆల్ట్రోజ్‌ను ఫేస్‌లిఫ్ట్ మరింత స్పోర్టీగా, ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించారు. నూతన ఫ్రంట్ బంపర్, పదునైన హెడ్‌లాంప్స్, వెనుక భాగంలో T-షేప్ LED టెయిల్ లైట్స్, LED లైట్ బార్ ద్వారా లైట్లు కలిపిన డిజైన్,

డ్యూయల్-టోన్ బంపర్, “Altroz” బ్రాండింగ్ వంటివి అందించారు. ఈ కారును డ్యూన్ గ్లో, అంబర్ గ్లో, ప్రిస్టిన్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చారు.

55
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

ఈ కారులో 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. 6 స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ ప్యూరిఫైయర్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ హోల్డ్, EBDతో కూడిన ABS వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు.

Read more Photos on
click me!

Recommended Stories