డాండెలీ డ్రిజిల్, డేటోనా గ్రే, నైట్రో క్రిమ్సన్, డ్యూన్ గ్లో, ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్ అనే ఆరు రంగుల్లో ఈ కారు దొరుకుతుంది. తక్కువ బడ్జెట్‌లో సెడాన్ కొనాలనుకునే వాళ్ళను, సీఎన్‌జీతో డైలీ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వాళ్ళను టాటా టార్గెట్ చేసింది. అయితే రూ.5.29 లక్షలు అనేది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ కలిపితే ఆన్-రోడ్ ధర ఇంకా పెరుగుతుంది.
మార్కెట్లో ఉన్న మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ లాంటి కాంపాక్ట్ సెడాన్లకు టాటా ఏరిస్ గట్టి పోటీ ఇస్తుంది. కాబట్టి కేవలం ప్రారంభ ధరను మాత్రమే చూసి మోసపోకుండా.. మీకు పెట్రోల్ కావాలా సీఎన్‌జీ కావాలా, మాన్యువల్ బెస్టా ఆటోమేటిక్ బెస్టా అనేది మీ అవసరాన్ని బట్టి సరైన వేరియంట్‌ను ఎంచుకోవడం ముఖ్యం.