రోజువారీ వాడకాన్ని చాలా ఈజీ చేసే ఎన్నో ఫీచర్లతో కొనార్క్ వస్తోంది. మోటార్ సాయంతో స్కూటర్‌ను వెనక్కి నెట్టడానికి పార్క్ అసిస్ట్ ఫీచర్ ఉపయోగపడుతుంది. బండిని ఆపిన తర్వాత అదే చోట నిలబెట్టడానికి ఆటో హోల్డ్ సిస్టమ్ పనిచేస్తుంది.
కోనార్క్ Z వేరియంట్‌లో AEBS ఫీచర్ కూడా దొరుకుతుంది. ఎలక్ట్రానిక్ కంట్రోల్ ద్వారా బ్రేకింగ్‌ను మెరుగుపరచడానికి, బండి ఆగే దూరాన్ని తగ్గించడానికి, సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు వెనుక చక్రం లాక్ అవ్వకుండా ఆపడానికి ఈ సిస్టమ్ హెల్ప్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
యాప్ ద్వారా బూట్ ఓపెన్ చేయొచ్చు
మ్యాజిక్ కీ సిస్టమ్ ద్వారా ఏథర్ యాప్ వాడి స్కూటర్ బూట్ స్పేస్‌ను ఓపెన్ చేయొచ్చు. కొనార్క్ Z 161 మోడల్‌లో ఈ సిస్టమ్‌తో పాటు ఆటో-పాప్ ఫీచర్ కూడా ఉంటుంది. దీనివల్ల బూట్ స్పేస్ దానంతట అదే ఓపెన్ అవుతుంది.
డాష్ బోర్డులో వాట్సాప్, గూగుల్ మ్యాప్స్
కొనార్క్ Z మోడల్ డాష్‌బోర్డ్‌లో గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ ఫీచర్లు ఉంటాయి. అయితే భద్రత దృష్ట్యా స్కూటర్ ఆగినప్పుడే డాష్ బోర్డులో వాట్సాప్ మెసేజెస్ చదవడానకి వీలుంటుంది. రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మెసేజ్ వచ్చినట్లు అలర్ట్ మాత్రమే వస్తుంది. ఇక డాష్ బోర్డులో క్రికెట్ స్కోర్ చూసుకునే ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది.
ఏథర్ కనెక్ట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా థెఫ్ట్ అలర్ట్, టో అలర్ట్, రైడ్ స్టేటస్, ఫైండ్ మై స్కూటర్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, OTA అప్‌డేట్స్ లాంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. టాప్ వేరియంట్‌లో వెహికల్ ఫెయిల్‌సేఫ్ ఫీచర్ కూడా ఇచ్చారు. S 125, S 161 మోడళ్లలో ఎయిర్‌వాక్ ఫీచర్ కూడా దొరుకుతుంది.