Normal Petrol vs Power Petrol: నార్మల్ పెట్రోల్ vs స్పీడ్ vs పవర్ పెట్రోల్ మధ్య ఉన్న తేడాలు ఏంటి? మీ వాహనానికి ఏది బెస్ట్?

Published : May 15, 2026, 03:07 PM IST

Normal Petrol vs Power Petrol: పెట్రోలో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నార్మల్ పెట్రోల్ కంటే ఎక్కువ రేటు ఉండే స్పీడ్ లేదా పవర్ పెట్రోల్ కొనాలంటే ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం పెట్రోల్ కొనడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి?

PREV
14
నార్మల్, స్పీడ్ పెట్రోల్ అంటే ఏంటి?

మనం రెగ్యులర్‌గా బంకుల్లో కొట్టించే సాధారణ పెట్రోల్‌నే నార్మల్ లేదా అన్‌లెడెడ్ పెట్రోల్ అంటారు. పర్యావరణాన్ని కాపాడటానికి ఇందులో నుంచి సీసం కంటెంట్‌ను తొలగిస్తారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. మనం సాధారణంగా వినే పెట్రోల్ ధరల దీని గురించే.

మరోవైపు, స్పీడ్ పెట్రోల్ అనేది భారత్ పెట్రోలియం (BPCL) సంస్థకు చెందిన ఒక బ్రాండెడ్ హై పర్‌ఫార్మెన్స్ పెట్రోల్. వాహనం పర్‌ఫార్మెన్స్, మైలేజ్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ చెప్తోంది. ఇది కారు ఇంజిన్‌లోని ఇన్‌టేక్ వాల్వ్స్, పోర్ట్స్‌లో పేరుకుపోయే హానికరమైన వ్యర్థాలను క్లీన్ చేస్తుంది. ఇంధన వ్యవస్థ తుప్పు పట్టకుండా కాపాడుతుంది. ఇందులో స్పీడ్, స్పీడ్ 97 అనే వేరియంట్లు ఉన్నాయి. నార్మల్ పెట్రోల్ కంటే స్పీడ్ ధర ఎక్కువ, అలాగే స్పీడ్ 97 ధర అన్నింటికంటే చాలా ఎక్కువ.

24
పవర్ పెట్రోల్ కథ ఏంటి?

హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) కంపెనీ విక్రయించే హై పర్‌ఫార్మెన్స్ పెట్రోల్‌ను పవర్ పెట్రోల్ అంటారు. దీని వల్ల కలిగే లాభాలు కూడా దాదాపు స్పీడ్ పెట్రోల్ లాంటివే. ఇన్‌టేక్ వాల్వ్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్లలో ఉండే వ్యర్థాలను ఇది క్లీన్ చేస్తుంది. ఇంజిన్‌లో ఇంధనం సరిగ్గా మండేలా చేసి మైలేజ్ పెంచుతుంది.

అంతేకాకుండా, వాహనం నడిపేటప్పుడు మంచి కంఫర్ట్‌ను, పవర్ అండ్ యాక్సిలరేషన్‌ను ఇస్తుంది. ఇంజిన్ నాకింగ్ సమస్యను తగ్గిస్తుంది. పవర్ పెట్రోల్ ధర కూడా నార్మల్ పెట్రోల్ కంటే ఎక్కువే ఉంటుంది. ఇందులో పవర్ 99 అనే వేరియంట్ ధర అన్నింటికంటే చాలా కాస్ట్లీ. అయితే ఈ ఫీచర్లన్నీ కంపెనీలు మార్కెటింగ్ కోసం చెప్పేవి కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ అర్థం కావాలంటే ముందుగా మనకు ఆక్టేన్ రేటింగ్ గురించి తెలియాలి.

34
ఏంటి ఈ ఆక్టేన్ రేటింగ్?

పెట్రోల్ అనేది చాలా త్వరగా మండే గుణం ఉన్న ఇంధనం. ఇంజిన్ లోపల అది ముందే మండిపోకుండా నిరోధించడానికి ఆక్టేన్ అనే ఖరీదైన కెమికల్‌ను పెట్రోల్‌లో కలుపుతారు. పెట్రోల్ ఎంత ఎక్కువ ప్రెజర్‌ను తట్టుకోగలదు అనేదానిపై ఈ ఆక్టేన్ రేటింగ్ ఆధారపడి ఉంటుంది. ఆక్టేన్ నంబర్ ఎక్కువగా ఉంటే ఇంజిన్ నాకింగ్ లేకుండా స్మూత్‌గా నడుస్తుంది. కానీ ఆక్టేన్ రేటింగ్ పెరిగేకొద్దీ పెట్రోల్ ధర కూడా బాగా పెరుగుతుంది. వివిధ పెట్రోల్ రకాల ఆక్టేన్ రేటింగ్స్ ఇలా ఉన్నాయి..

పెట్రోల్ రకం ఆక్టేన్ రేటింగ్

  • నార్మల్ పెట్రోల్ - 85 నుంచి 91
  • స్పీడ్ పెట్రోల్ - 90
  • పవర్ పెట్రోల్ - 91 నుంచి 94
  • స్పీడ్ - 97 నుంచి 97
  • పవర్ - 99 నుంచి 99
44
అసలు నిజం ఇదీ

చూడటానికి స్పీడ్, పవర్ పెట్రోల్స్ సూపర్ అనిపించినా, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇండియాలో ఉండే చాలా సాధారణ కార్లు 87 ఆక్టేన్ ఇంధనంతో నడిచేలా డిజైన్ చేశారు. అలాంటి 87 ఆక్టేన్ కారు ఇంజిన్‌లో మీరు వెళ్లి 90 ఆక్టేన్ పెట్రోల్ పోస్తే.. మైలేజ్ గానీ, పర్‌ఫార్మెన్స్ గానీ అస్సలు పెరగదు. పైగా లాంగ్ రన్‌లో ఇంజిన్ దెబ్బతినే ఛాన్స్ ఉందని చాలా మంది కార్ల తయారీదారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీ కారు మ్యాన్యువల్ బుక్ చూసి, అందులో రికమండ్ చేసిన ఆక్టేన్ లెవెల్ పెట్రోల్ మాత్రమే వాడటం మంచింది. బిఎమ్‌డబ్ల్యూ, ఆడి లాంటి లగ్జరీ, హై పర్‌ఫార్మెన్స్ కార్లు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి ప్రీమియం పెట్రోల్ వాడటం గురించి ఆలోచించాలి.

Read more Photos on
click me!

Recommended Stories