Mahindra XUV400 EV : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. ఈ కారుపై రూ.2.50 లక్షల డిస్కౌంట్

Published : May 13, 2026, 03:59 PM IST

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఈ నెలలో (మే 2026) భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అన్నింటికంటే పెద్ద ఆఫర్ ఎలక్ట్రిక్ XUV400 EV కారుపైనే ఉంది. వెంటనే ఈ కారు కొంటే వందలు, వేలు కాదు ఏకంగా లక్షల్లో ఆదా చేసుకోవచ్చు. 

PREV
14
మహింద్రా XUV400 EV పై భారీ డిస్కౌంట్

Mahindra XUV400 EV : భారతదేశ వాహన తయారీ రంగంలో మహింద్రా ఆండ్ మహింద్రా కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే స్కార్పియో, థార్ వంటి ప్రీమియం కార్లనే కాదు సామాన్య, మధ్యతరగతి ప్రజలకోసం XUV పేరిట కాంపాక్ట్ SUV లను కూడా తీసుకువచ్చింది. ఇప్పుడు వీటిపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించి ప్రజలకు మరింత దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది మహింద్రా సంస్థ.

24
మహింద్రా XUV400 EV పై భారీ డిస్కౌంట్..

మహింద్రా కార్లలో ప్రస్తుతం అత్యధిక డిస్కౌంట్ XUV400 EV పైనే ఉంది. ఈ ఎస్‌యూవీ కొనుగోలుపై కస్టమర్లు ఏకంగా రూ.2.50 లక్షల క్యాష్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌ను కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని EC ప్రో, EL ప్రో వేరియంట్లపై అందిస్తోంది. 

XUV400 EV ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.15.49 లక్షలు. డిస్కౌంట్ తో దీని ధర దాదాపు రూ.12.99 లక్షలకు తగ్గుతుంది. అంటే ఈ నెలలో కారు కొంటే డిస్కౌంట్‌ రూపంలో ఏకంగా రూ.2.50 లక్షల వరకు ఆదా అవుతుంది. అయితే గత నెల ఏప్రిల్ నుండి ఈ ఆఫర్ ను కొనసాగిస్తోంది మహింద్రా.

34
మహీంద్రా XUV400 EV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు...

మహీంద్రా XUV400 లో కొత్తగా EC ప్రో, EL ప్రో అనే PRO వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త EVలో అప్‌డేట్ చేసిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఫీచర్లు, డ్యూయల్ టోన్ థీమ్, మునుపటి కంటే మెరుగైన టెక్నాలజీని అమర్చారు. పాత డ్యాష్‌బోర్డ్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ డిజైన్‌ను మరింత ఆధునికంగా కనిపించేలా మార్చారు. డ్యాష్‌బోర్డ్‌లో ప్యాసింజర్ వైపు ఇప్పుడు స్టోరేజ్ స్పేస్‌తో పాటు పియానో బ్లాక్ ఇన్సర్ట్ కూడా వస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే దీని 34.5 kWh బ్యాటరీ ప్యాక్ 375 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 39.4 kWh బ్యాటరీ ప్యాక్ 456 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

XUV700, XUV400 N మోడళ్లలో ఉన్నట్టుగానే XUV400 లో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా మార్చారు. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను అమర్చడం కోసం XUV400 సెంట్రల్ ఏసీ వెంట్లను కూడా రీ-పొజిషన్ చేశారు. స్టీరింగ్ వీల్ కూడా XUV700 మోడల్‌ను పోలి ఉంటుంది. XUV400 క్యాబిన్‌లో 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి అనేక కొత్త ఫీచర్లను కూడా చేర్చారు.

44
xuv400 EV లో సేఫ్టీ ఫీచర్లివే..

XUV400 EV లో డ్యూయల్-జోన్ ఏసీ, వెనుక సీటు ప్రయాణికుల కోసం టైప్-సి యూఎస్‌బీ ఛార్జర్, కొత్త రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, డ్రైవర్ సీటు ఎత్తును సర్దుబాటు చేసుకునే సౌకర్యం వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మొదటిసారిగా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా అందిస్తున్నారు. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories