Nissan Magnite నిస్సాన్ మాగ్నైట్ CNG: ఇదేనా మైలేజీ కింగ్? కంపెనీ చెబుతోంది నిజమేనా??

ఎస్యూవీ అంటేనే స్టైల్, మెరుగైన పనితీరుకి మారుపేరు. ఇందులో పవర్ గురించి చూడాలే తప్ప మైలేజీ గురించి ఆలోచింవద్దు. కానీ ఏప్రిల్లో విడుదల అవుతున్న కొత్త నిస్సాన్ Magnite CNGతో మంచి మైలేజీ వస్తుందని ఢంకా బజాయించి మరీ చెబుతోంది తయారీదారు.

Nissan magnite CNG launching next month best mileage SUV in telugu
మొదటి CNG కాంపాక్ట్ SUV

మారుతి సుజుకి, టాటా తర్వాత, ఇప్పుడు నిస్సాన్ ఇండియా కూడా తన మొదటి CNG కాంపాక్ట్ SUVని ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త మోడల్ రాకతో, కస్టమర్లకు చాలా మంచి ఆప్షన్లు కూడా లభిస్తాయి. నిస్సాన్ మాత్రమే కాదు చాలా కంపెనీలు CNG సెగ్మెంట్లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాయి. కొత్త Magnite CNG వచ్చే నెలలో (ఏప్రిల్) విడుదల కానుంది. ఈ వెహికల్ టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఇండియాలో, ఇది టాటా పంచ్‌తో పోటీపడుతుంది.

Nissan magnite CNG launching next month best mileage SUV in telugu
తక్కువ ధరలో CNG కారు

నిస్సాన్ Magniteలో CNG కిట్‌ను డీలర్ స్థాయిలో అమర్చుతారు. CNG కిట్‌తో పాటు 1 సంవత్సరం డీలర్ వారంటీ కూడా వస్తుంది. కానీ CNG కిట్ ధర రూ. 75,000 నుండి రూ. 79,500 వరకు ఉండొచ్చని సమాచారం. CNG మోడల్ ద్వారా కంపెనీ మార్కెట్ వాటా పెరుగుతుందని కంపెనీ తెలిపింది.


నిస్సాన్ CNG కారు

Magnite యొక్క 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు మాత్రమే CNG కిట్ అమర్చుతారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసి వస్తుంది. Magnite CNG వెర్షన్ 22/Kg వరకు మైలేజ్ ఇవ్వొచ్చని అంచనా. అయితే, CNG కిట్‌తో పవర్, టార్క్ అవుట్‌పుట్‌తో సహా ఇతర స్పెసిఫికేషన్‌ల గురించి వివరాలు ఇంకా విడుదల కాలేదు. 

ఎక్కువ మైలేజ్ ఇచ్చే CNG కారు

భద్రత కోసం, ఈ Magniteలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హై-స్పీడ్ వార్నింగ్ సిస్టమ్, చైల్డ్ సీట్ మౌంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి  అత్యాధునిక  ఫీచర్లు ఉన్నాయి.

బెస్ట్ మైలేజ్ కారు

Magnite CNG టాటా పంచ్ CNGతో పోటీపడుతుంది. టాటా పంచ్ CNGలో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 72.49 bhp శక్తిని, 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంది. టాటా పంచ్ CNG డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. దీనికి 210 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, ఇది మంచి స్పేస్ అని చెబుతారు. ఈ మోడల్ 26.99 కిమీ/కేజీ మైలేజ్ ఇస్తుంది.

Latest Videos

vuukle one pixel image
click me!