Ducati Scrambler యంగిస్థాన్ కోసం.. చౌకైన డుకాటీ బైక్ స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ఎడిషన్! ఫీచర్లు అదరహో..
భారత్ లో సూపర్ బైక్ ల గురించి చెప్పాల్సి వస్తే డుకాటీ స్క్రాంబ్లర్ తప్పకుండా ముందుంటుంది. ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీదారు డుకాటీ, స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ఎడిషన్‌ను ఇండియాలో విడుదల చేసింది. స్క్రాంబ్లర్ ఐకాన్ ప్రస్తుతం ఇండియాలో అమ్మకానికి ఉన్న చౌకైన డుకాటీ. 2025 డుకాటీ స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ఎడిషన్ దాని రెగ్యులర్ వేరియంట్‌తో సమానమైన టెక్నాలజీ, మెకానికల్ ఫీచర్లతో వస్తోంది. డిజైన్ పరంగా మరిన్ని అప్‌డేట్‌లు ఉన్నాయి.