MG Comet : అసలే చవకైన ఈవీ కారు.. ఇప్పుడు ఇయర్ ఎండ్ ఆఫర్లో మరో రూ.1 లక్ష డిస్కౌంట్

Published : Dec 08, 2025, 03:14 PM IST

భారతదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్… దీనిపై ప్రస్తుతం ప్రత్యేక డిస్కౌంట్ కొనసాగుతోంది. ఇయర్ ఎండ్ ఆఫర్ కింద కస్టమర్లు రూ.1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

PREV
15
MG Comet పై భారీ డిస్కౌంట్...

భారత్‌లో ఎలక్ట్రిక్(EV) వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈవి కార్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా ప్రజలు మాత్రం వెనక్కితగ్గడంలేదు. ఇలాంటిది దేశంలోనే అత్యంత చవకైన ఈవి కారు ఎంజీ కామెట్ (MG Comet) తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దేశ ప్రజలకు ఇప్పటికే చేరువైన ఈ కారు ఇయర్ ఎండ్ ఆఫర్ కింద మరింత తక్కువ ధరకే వస్తోంది. వెంటనే (డిసెంబర్ 2025 లో) ఈ కారును కొనేవారు దాదాపు రూ.1 లక్ష వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

25
అర్బన్ కారుకు అదిరిపోయే డిమాండ్

ఎంజీ కామెట్ ఈవిని నగరాలు, పట్టణాల్లోని ఇరుకైన రోడ్లపై, ట్రాఫిక్ లో ప్రయాణానికి అనువుగా రూపొందించారు. కేవలం రెండు డోర్లతో కూడిన ఈ చిన్నకారు చూడ్డానికి ప్రత్యేకంగా ఉంటుంది... అలాగే సౌకర్యవంతంగానూ ఉంటుంది. ధర తక్కువగా ఉండటంతో మధ్య తరగతి ప్రజలు కూడా ఈ ఈవిని బాగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్లలో కామెట్ ఒకటి.  ఇయర్ ఎండ్ ఆఫర్ లో ధర తగ్గడంతో కామెట్ సేల్స్ మరింత దూసుకుపోయే అవకాశాలున్నాయి.

35
MG Comet ఫీచర్లు

ఎంజీ కామెట్ ఈవీ 17.3 kWh బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి పూర్తిగగా ఛార్జ్ చేస్తే 230 కి.మీ. రేంజ్ ఇస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 42 bhp పవర్, 110 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3.3 kW ఛార్జర్‌తో 7 గంటల్లో ఛార్జ్ అవుతుంది.

45
కామెట్ టెక్ ఫీచర్లు

ఈ చిన్న కారులో టెక్నాలజీ ఫీచర్లున్నాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. 55+ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్, కెమెరా ఉన్నాయి.

55
కామెట్ ధర ఎంత?

భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.50 లక్షల నుంచి రూ.9.56 లక్షల వరకు ఉంది. డిస్కౌంట్ మొత్తం నగరం, డీలర్‌షిప్, వేరియంట్‌ను బట్టి మారొచ్చు. కొనే ముందు అధికారిక డీలర్‌ను సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories