సేఫ్టీ ఫీచర్లు, ఇతర సౌకర్యాలు..
సౌకర్యాల విషయానికొస్తే కొత్త హ్యుందాయ్ ఐయానిక్ 5లో కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్ (ccNC), కంట్రోలర్ ఓవర్-ది-ఎయిర్ (C-OTA) అప్‌డేట్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, యాక్టివ్ సౌండ్ డిజైన్ (ASD), హ్యుందాయ్ బ్లూలింక్ ద్వారా రిమోట్ ఇమ్మొబిలైజేషన్, కొత్త ఇన్-కార్ పేమెంట్ సౌకర్యం వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఈ అప్‌డేటెడ్ SUVలో పార్కింగ్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్ - రియర్ (PCA-R), పార్కింగ్ డిస్టెన్స్ వార్నింగ్ (PDW - సైడ్) వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందించారు.
కొత్త హ్యుందాయ్ ఐయానిక్ 5 లాంచ్ గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తరుణ్ గార్గ్ మాట్లాడారు. 'ఎలక్ట్రిక్ మొబిలిటీని పునర్నిర్వచించాలనే మా లక్ష్యానికి హ్యుందాయ్ ఐయానిక్ 5 ఒక నిజమైన నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గుర్తింపులతో పాటు, ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్', 'గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను గెలుచుకుంది. డిజైన్, టెక్నాలజీ, స్థిరత్వంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కొత్త ఐయానిక్ 5తో డ్రైవింగ్ రేంజ్, టెక్నాలజీ, రోజువారీ సౌకర్యాన్ని పెంచే అప్‌డేట్స్ అందిస్తున్నాం. ఈ మార్పులు ప్రీమియం, ఫ్యూచర్-రెడీ ఎలక్ట్రిక్ SUVగా ఐయానిక్ 5 ఆకర్షణను మరింత బలోపేతం చేస్తాయి' అని ఆయన పేర్కొన్నారు.