Brezza Facelift : మతిపోగొట్టేలా మారుతి బ్రెజా నయా లుక్.. ఫీచర్స్ అదుర్స్..!

Published : Apr 29, 2026, 11:21 AM IST

మారుతి సుజుకి తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజాకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. డిజైన్‌లో చిన్న మార్పులు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి కొత్త ఫీచర్లతో ఈ కారు రానుంది.

PREV
15
మారుతి బ్రెజా.. పాపులర్ ఎస్‌యూవీ

భారత్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ వేగంగా పెరుగుతోంది.  ఈ క్రమంలోనే మారుతి సుజుకి తన పాపులర్ ఎస్‌యూవీ బ్రెజాను 2022లో లాంచ్ చేసింది. విడుదలైనప్పటి నుంచి బ్రెజా అద్భుతమైన అమ్మకాలతో మారుతి బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది.

మార్కెట్లో పోటీ తీవ్రం కావడంతో ఈ కారుకు అప్‌డేట్ అవసరమైంది. దీంతో మారుతి బ్రెజా కొత్తరూపంలో మార్కెట్లోకి రానుంది. మారుతి కంపెనీ త్వరలోనే బ్రెజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురాబోతోందనే ప్రచారం ఆటోమొబైల్ మార్కెట్లో గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన సరికొత్త కారు ఆకట్టుకుంది… ఈ  కారును ప్రస్తుతం కంపెనీ పరీక్షిస్తోంది.

25
మారుతి బ్రెజాలో సరికొత్త అప్‌డేట్స్..

 కొత్త బ్రెజాలో చాలా కొత్త అప్‌డేట్లు ఉండొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్‌తో కారును మరింత ఆధునికంగా, ఫీచర్లతో నింపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV3XO వంటి కార్లతో మారుతి బ్రెజా పోటీ పడుతోంది.

35
డిజైన్‌లో కొత్తదనం

డిజైన్ పరంగా కొత్త మారుతి సుజుకి బ్రెజా లుక్ దాదాపు ప్రస్తుత మోడల్ లాగే ఉంటుందని అంచనా. హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్ డిజైన్లు మారకపోవచ్చు. అయితే కారుకు ఫ్రెష్ లుక్ ఇచ్చేందుకు ఫ్రంట్ బంపర్, గ్రిల్‌లో కంపెనీ కొన్ని మార్పులు చేయనుంది. కొత్త అల్లాయ్ వీల్స్ కూడా కనిపించవచ్చు.

45
ఫీచర్లు, ఇంజిన్ లో భారీ అప్‌గ్రేడ్

ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండొచ్చు. ప్రస్తుత మోడల్‌లో 9-అంగుళాల స్క్రీన్ ఉండగా, కొత్త మోడల్‌లో 10.25-అంగుళాల పెద్ద స్క్రీన్ పెట్టొచ్చు. కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) కూడా ఇవ్వొచ్చు. సైడ్ మిర్రర్లపై ఉన్న ఎక్స్‌టెన్షన్లు, కారులో 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉంటుందని సూచిస్తున్నాయి.

కొత్త బ్రెజా ఇంజిన్ గురించి ఎక్కువ సమాచారం లేదు. కానీ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (6MT) ఆప్షన్‌తో రావొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి. ఫేస్‌లిఫ్ట్‌లలో సాధారణంగా ఇంజిన్‌లో పెద్ద మార్పులు చేయరు…కాబట్టి మారుతి సుజుకి బ్రెజాలో ప్రస్తుత 1.5-లీటర్ K15C ఇంజిన్‌నే కొనసాగించవచ్చు. పెట్రోల్, సీఎన్‌జీ, మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్లు ఉంటాయి. సీఎన్‌జీ వేరియంట్‌లో బూట్ స్పేస్ పెంచేందుకు అండర్‌బాడీ సిలిండర్ ఇవ్వొచ్చు.

55
ఏం ఆశించవచ్చు..?
మొత్తం మీద, కొత్త బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌లో చిన్న డిజైన్ మార్పులు, ముఖ్యమైన ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఎస్‌యూవీని మరింత ప్రీమియంగా, టెక్నాలజీతో నింపి, మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని కంపెనీ చూస్తోంది.
Read more Photos on
click me!

Recommended Stories