Hyundai creta: రూ. 50 వేల జీతం ఉన్నా చాలు.. ఈ కారు కొనుక్కోవ‌చ్చు. రూ. ల‌క్ష డౌన్‌పేమెంట్‌తో..

Published : Apr 18, 2025, 03:40 PM IST

కారు కొనుగోలు చేయాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆశిస్తుంటారు. ఒక‌ప్పుడు కేవ‌లం ల‌గ్జ‌రీగా భావించిన కారు, ఇప్పుడు నిత్య‌వ‌స‌ర వ‌స్తువుగా మారిపోతోంది. ముఖ్యంగా క‌రోనా త‌ర్వాత కారును ఉప‌యోగించే వారి సంఖ్య ఎక్కువైంది. దీంతో సెకండ్ హ్యాండ్ కార్ల వినియోగం పెరిగింది. అయితే బ్యాంకులు ఆఫ‌ర్ల‌తో కొత్త కార్ల‌కు కూడా డిమాండ్ పెరిగింది. ఈ క్ర‌మంలోనే హ్యుందాయ్ క్రెటాపై మంచి డీల్ ల‌భిస్తోంది. ఈ కారును సొంతం చేసుకోవాలంటే ఎంత డౌన్‌పేమెంట్ క‌ట్టాలి.? ఈఎమ్ఐ ఎంత ఉంటుంది.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Hyundai creta: రూ. 50 వేల జీతం ఉన్నా చాలు.. ఈ కారు కొనుక్కోవ‌చ్చు. రూ. ల‌క్ష డౌన్‌పేమెంట్‌తో..

భార‌త మార్కెట్లో అత్యధికంగా అమ్ముడ‌వుతోన్న కార్ల‌లో హ్యుందాయ్ క్రెటా ఒకటి. హ్యుందాయ్ క్రెటా ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమై రూ. 20.50 లక్షల వరకు ఉంటుంది. ఈ కారును కొనుగోలు చేసే వారికి బ్యాంకులు మంచి ఈఎమ్ఐ ఆప్ష‌న్‌ను అందిస్తున్నాయి. ఈ కారు ప్రారంభ వేరియంట్ ధ‌ర రూ. 11 ల‌క్ష‌ల‌తో మొద‌ల‌వుతుంది. ఈ కారు స్టార్టింగ్ వేరియంట్ తీసుకుంటే ఎంత ఈఎమ్ఐ చెల్లించాలి.? ఎంత డౌన్ పేమెంట్ క‌ట్టాలంటే. 

24

హ్యుందాయ్ క్రెటా ప్రారంభ వేరియంట్‌పై రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ పొఒందొచ్చు. ఈ కారును సొంతం చేసుకోవాలంటే మీరు రూ. 1 ల‌క్ష డౌన్‌పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 7 సంవ‌త్స‌రాలకు గాను లోన్ తీసుకుంటే బ్యాంక్ ఈ రుణంపై 9 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దీంతో మీరు ప్ర‌తీ నెల రూ. 16 వేలు ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. స‌గ‌టున నెల‌కు రూ. 50 వేల జీతం వ‌చ్చే వారు ఈ కారును సొంతం చేసుకోవ‌డం సులువ‌నే చెప్పాలి. 

34

ఒక‌వేళ మీరు 6 సంవ‌త్స‌రాల్లోనే ఈఎమ్ఐ క్లోజ్ చేయాల‌ని అనుకుంటే అప్పుడు మీరు నెల‌కు రూ. 18,000 ఈఎమ్ఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కూడా 9 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. కొత్త కారు కాబ‌ట్టి సిబిల్ స్కోర్‌తో పెద్ద‌గా సంబంధం లేకుండా రుణాలు అందిస్తారు. ఇక హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఐదు సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటుతో 60 నెలల పాటు ప్రతి నెలా రూ.21,000 ఈఎమ్ఐ చెల్లిస్తే స‌రిపోతుంది. 

44

ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.. 

ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 1.5 లీటర్ నాచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజ‌న్‌ను అందించారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీట‌ర్‌కు సుమారు 16-17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హాలోజన్ హెడ్‌లాంప్స్‌,  16-ఇంచ్ స్టీల్ వీల్స్, ఫ్రంట్ గ్రిల్ మస్క్యులర్ డిజైన్‌ను అందించారు.  సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను అందించారు. రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ వీల్ డిస్క్ బ్రేక్స్, సీట్ బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్ వంటి అధునాత‌న ఫీచ‌ర్లు ఈ కారు సొంతం. 

Read more Photos on
click me!

Recommended Stories