Ola: రూ. 6 వేలు డౌన్‌ పేమెంట్‌తో ఓలా స్కూటీ మీ సొంతం.. నెలకు కేవలం రూ. 2800

Published : Apr 17, 2025, 12:59 PM IST

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్‌ ధరలు భారీగా పెరగడం, ప్రభుత్వాలు సైతం ఈవీ వాహనాలకు సబ్సిడీలు అందిస్తుండడంతో చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా స్కూటీలకు మంచి డిమాండ్‌ ఉంటోంది. ఈక్రమంలోనే టూ వీలర్‌ ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో అగ్రగామిగా రాణిస్తున్న ఓలా కస్టమర్ల కోసం అదిరిపోయే డీల్‌ను తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
14
Ola: రూ. 6 వేలు డౌన్‌ పేమెంట్‌తో ఓలా స్కూటీ మీ సొంతం.. నెలకు కేవలం రూ. 2800

తక్కువ దూరం ప్రయాణించే వారు, రోజువారీ పనుల కోసం వాహనాన్ని ఉపయోగించే వారు ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా వీటికి అట్రాక్ట్‌ అవుతున్నారు. ఈ మార్కెట్లో ముందు వరుసలో ఉంటోంది ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా. ఇప్పటి వరకు పలు మోడల్స్‌ను లాంచ్‌ చేసిన ఓలా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కస్టమర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓలా ఎస్‌1 ఎక్స్‌పై మంచి ఆఫర్‌ను ప్రకటించింది. 

24

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ డౌన్‌పేమెంట్‌తో స్కూటీని సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రారంభ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 89,999గా నిర్ణయించారు. తక్కువ ధరలో మంచి రేంజ్‌, పనితీరుతో కూడిన స్కూటీలో ఎన్నో అధునాతన ఫీచర్లను అందించారు. తాజాగా  స్కూటీపై అదిరిపోయే ఈఎంఐ ఆప్షన్‌ను అందించారు. 
 

34

ఇందుకోసం మీరు కేవలం రూ. 6000 డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని మూడేళ్ల వరకు ఈఎంఐగా చెల్లించవచ్చు. ఇందుకుగాను మీరు 9.7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే 36 నెలల పాటు మీరు నెలకు రూ. 2877 చెల్లిస్తే స్కూటీ మీ సొంతం అవుతుందన్నమాట. అయితే మీ సిబిల్‌ స్కోర్‌ ఇంకా మెరుగ్గా ఉంటే వడ్డీ తగ్గుతుంది. దీంతో ఈఎమ్‌ఐ కూడా తగ్గుతుంది. పూర్తి వివరాల కోసం దగ్గర్లో ఉన్న ఓలా షోరూమ్‌ను సంప్రదించండి. 
 

44

ఓలా ఎస్‌1 ఎక్స్‌ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

ఇకఈ స్కూటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో 3కేడబ్ల్యూ మ్యాగ్జిమం పవర్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోటారును అందించారు. 3 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఈ స్కూటీ సొంతం. ఇక మైలేజ్‌ విషయానికొస్తే ఈ స్కూటీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 190 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories