Hyundai nexo hydrogen: మార్కెట్ లోకి అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అదిరిపోయే ఫీచర్లతో హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్ లోకి వచ్చింది. హ్యుందాయ్ తన కొత్త హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనం 'నెక్సో'ను విడుదలతో ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవం తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai nexo hydrogen: సూపర్ ఫీచర్లతో మరో ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్ లోకి వచ్చింది. అదే హ్యుందాయ్ నెక్స్. హ్యుందాయ్ తన కొత్త హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (FCEV)ను మార్కెట్ లోకి విడుదల చేసింది.
ఇది ఇప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల లవర్స్ కు గొప్ప ఎంపిక కావచ్చు.
25
Hyundai Nexo Hydrogen SUV
కొత్త తరం SUV హ్యుందాయ్ నెక్సో
హ్యుందాయ్ ఈ కొత్త SUV కి 'నెక్సో' అని పేరు పెట్టింది. ఇది నెక్సో సెకండ్ వెర్షన్. లెటెస్ట్ టెక్నాలజీ కలిగిన SUVని మొదటిసారిగా 2025 సియోల్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. దీనిలో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది మునుపటి వెర్షన్ లో ఉన్నవాటి కంటే అనేక ఫీచర్లను అప్ గ్రేడ్ చేశాడు.
35
7.8 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగం
సెకండ్ జెనరేషన్ నెక్సో SUV 150 kW ఎలక్ట్రిక్ మోటారుతో శక్తిని పొందుతుంది. ఇది 110 kW పవర్ సెల్ స్టాక్, 2.64 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ SUV గరిష్ట వేగం గంటకు 179 కిలో మీటర్లు. కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
45
Hyundai Nexo Hydrogen SUV Launched: Runs 700 Km on a Single Charge, Features, Range, Safety Highlights
అద్భుతమైన భద్రత, లగ్జరీ ఫీచర్లు
భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, హ్యుందాయ్ నెక్సోలో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉన్నాయి. అత్యవసర బ్రేకింగ్, సరౌండ్ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
55
Hyundai Nexo
ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. ట్విన్ డెక్ సెంటర్ కన్సోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 14 స్పీకర్లతో కూడిన ప్రీమియం బ్యాంగ్ & ఓలుఫ్సేన్ సౌండ్ సిస్టమ్ వంటి హై-టెక్ ఫీచర్లు ఉన్నాయి.