Family Scooter: హోండా యాక్టివా, యాక్టివా 125..ఈ రెండింటిలో ఫ్యామిలీకి ఏది బెస్ట్?

Published : Nov 10, 2026, 07:20 AM IST

Family Scooter: కొత్త స్కూటర్ కొనాలనుకుంటున్నారా? హోండా యాక్టివా 6G, యాక్టివా 125 రెండూ మంచి ఆప్షన్లే. అయితే ధర, మైలేజ్, ఇంజిన్ పనితీరు, ఫీచర్ల విషయంలో వీటి మధ్య కొన్ని తేడాలున్నాయి. మీ ఫ్యామిలీ అవసరాలకు ఏది సరిపోతుందో తెలుసుకుందాం.

PREV
15
ఈ రెండింటిలో డైలీ వాడేందుకు ఏది బెస్ట్?

ఇండియాలో స్కూటర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు 'హోండా యాక్టివా'. ఎన్నో ఏళ్లుగా ఫ్యామిలీల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ బ్రాండ్‌లో ఇప్పుడు రెండు మెయిన్ మోడల్స్ మార్కెట్లో ఉన్నాయి. అవే హోండా యాక్టివా 6G, యాక్టివా 125.

కోట్ల ఇళ్లలో 110cc స్కూటర్‌గా యాక్టివా 6G సూపర్ హిట్టైతే, కాస్త పెద్ద సైజు, ఎక్కువ పవర్‌తో యాక్టివా 125 పోటీ పడుతోంది. ఈ రెండింటి మధ్య ఛాయిస్ కేవలం స్పీడ్‌కు సంబంధించింది కాదు. మీ డైలీ అవసరాలు, బడ్జెట్, కంఫర్ట్‌ను బట్టి ఉంటుంది. వీటి ఫీచర్లు, ధరలు, టెక్నికల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

25
ఫ్యామిలీస్ మెచ్చిన స్కూటర్లు

యాక్టివా సిరీస్ ఫ్యామిలీస్ ఫేవరెట్ అవ్వడానికి దాని దృఢమైన 'మెటల్ బాడీ' డిజైన్ ముఖ్య కారణం. కూరగాయలు, సరుకులు తేవాలో, పిల్లల్ని స్కూల్‌కు తీసుకెళ్లాలో, ట్రాఫిక్‌లో ఈజీగా దూసుకెళ్లాలో.. ఇలా అన్నింటికీ ఇవి పర్ఫెక్ట్.

యాక్టివా 6G సింపుల్‌గా ఉంటూ మంచి మైలేజ్ ఇస్తుంది. బరువు తక్కువ కాబట్టి ఎవరైనా ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు.

యాక్టివా 125 విషయానికొస్తే.. రోడ్డు మీద కాస్త గంభీరంగా కనిపించాలనుకునే వాళ్లకు, డిజిటల్ డిస్‌ప్లే లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కోరుకునే వాళ్లకు ఇది బాగా సెట్ అవుతుంది.

హోండా 'సైలెంట్ స్టార్ట్ ఏసీజీ' (ACG Starter), 'ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్' (eSP) టెక్నాలజీలు ఈ రెండు స్కూటర్లలోనూ ఉన్నాయి.

35
ఫీచర్లు: సింప్లిసిటీ vs లేటెస్ట్ టెక్నాలజీ

హోండా యాక్టివా 6G సింపుల్, యూజ్‌ఫుల్ ఫీచర్లతో వస్తుంది. బేస్ వేరియంట్లలో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. పెట్రోల్ కొట్టించేప్పుడు సీటు తీయకుండా బయటే డబుల్-లిడ్ ఫ్యూయల్ ఫీలర్ క్యాప్ ఇచ్చారు. టాప్ వేరియంట్‌లో 'H-Smart' కీ టెక్నాలజీతో కీలెస్‌ స్టార్ట్, స్మార్ట్ అన్‌లాక్, రిమోట్‌తో స్కూటర్‌ను వెతికే ఆప్షన్లు వస్తాయి. ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఉన్నాయి.

ఇక యాక్టివా 125లో 4.2 ఇంచ్ డిజిటల్ TFT డిస్‌ప్లే ఇచ్చారు. దీని టాప్ మోడల్‌లోనూ H-Smart కీ వస్తుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ కోసం ముందు ఓపెన్ గ్లోవ్ బాక్స్‌లో USB Type-C పోర్ట్, క్రోమ్ ఫినిషింగ్‌తో ప్రీమియం లుక్ అందిస్తున్నారు.

45
వేరియంట్లు, ధరలు (ఎక్స్-షోరూమ్)

బడ్జెట్ పరంగా చూస్తే యాక్టివా 6G తక్కువ ధరకు వస్తుంది. యాక్టివా 125 ఎక్స్‌ట్రా ఫీచర్లతో కాస్త ఎక్కువ ధరకు దొరుకుతుంది.

హోండా యాక్టివా 6G వేరియంట్ల ధరలు:

స్టాండర్డ్ (Standard) – రూ.76,358

25 ఇయర్ యానివర్సరీ ఎడిషన్ (25 Year Anniversary Edition) – రూ.85,339

డీలక్స్ (Deluxe) – రూ.87,011

స్మార్ట్ (Smart) – రూ.91,482

హోండా యాక్టివా 125 వేరియంట్ల ధరలు:

25 ఇయర్ యానివర్సరీ ఎడిషన్ (25 Year Anniversary Edition) – రూ.89,656

డీఎల్ఎక్స్ (DLX) – రూ.91,679

హెచ్-స్మార్ట్ (H-Smart) – రూ.96,122

55
మీకు ఏ స్కూటర్ కరెక్ట్?

రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు మంచి మైలేజ్ కావాలంటే, ఇరుకు గల్లీల్లో తక్కువ బరువుతో ఈజీగా తిప్పే స్కూటర్ కావాలంటే, తక్కువ బడ్జెట్‌లో ఫ్యామిలీ స్కూటర్ కొనే ప్లాన్ ఉంటే మీరు హోండా యాక్టివా 6G ని కళ్లు మూసుకుని తీసుకోవచ్చు.

అలా కాకుండా వెనక ఒకరిని కూర్చోబెట్టుకుని స్పీడ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా వెళ్లాలంటే, డిజిటల్ TFT స్క్రీన్, మొబైల్ ఛార్జింగ్, ఫ్రంట్ స్టోరేజ్, డిస్క్ బ్రేక్ సేఫ్టీ, క్రోమ్ లుక్ కావాలంటే యాక్టివా 125 ని సెలెక్ట్ చేసుకోండి.

తక్కువ మెయింటెనెన్స్, బడ్జెట్ రేట్ కోరుకునే వాళ్లకు 6G బెస్ట్. కాస్త బడ్జెట్ పెట్టినా మోడ్రన్ ఫీచర్లు కావాలనుకుంటే 125కి వెళ్లొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories