Hero Xoom 125 : మొబైల్ ఛార్జింగ్, డిజిటల్ నావిగేషన్.. రూ.88000 కే స్మార్ట్ ఫీచర్లతో స్పోర్టీ లుక్ స్కూటర్

Published : Nov 09, 2026, 04:30 PM ISTUpdated : Nov 09, 2026, 04:55 PM IST

ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటొకార్ప్ నుండి స్పోర్టీ లుక్ లో వచ్చిన సూపర్ స్కూటర్ జూమ్ 125. దీని ధర కేవలం రూ.84,294 మాత్రమే. ఈ స్కూటర్ VX, ZX వేరియంట్లలో లభిస్తుంది… మరి ఈ రెండింటి మధ్య తేడాలు, పూర్తి ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

PREV
15
హీరో జూమ్ 125 ధరలు ప్రకటన

హీరో మోటోకార్ప్ తన సరికొత్త హీరో జూమ్ 125 (Hero Xoom 125) స్కూటర్ అధికారిక ధరలు, ఫీచర్లను ప్రకటించింది. VX (OBD2B) వేరియంట్ రూ.84,294 కే అందుబాటులో ఉండగా, ప్రీమియం ఫీచర్లతో వచ్చే ZX (OBD2B) ధర రూ.88,150 గా ఉంది… ఈ ధరలు డిల్లీ ఎక్స్-షోరూమ్ కి చెందినవి.

ఈ VX, ZX రెండు వేరియంట్లలోనూ ఇంజిన్, గేర్ సిస్టమ్ ఒకేలా ఉంటాయి. అయితే కొంచెం ఎక్కువ సేఫ్టీ, మరింత స్టైలిష్ ఫీచర్లు కావాలనుకునేవారి కోసం కంపెనీ జూమ్ ZX ఆప్షన్ తీసుకువచ్చింది.

25
హీరో జూమ్ 125 : ముఖ్య ఫీచర్లు ఇవే

హీరో జూమ్ 125 VX (OBD2B) ధర : రూ.84,294 (ఎక్స్-షోరూమ్)

హీరో జూమ్ ZX (OBD2B) ధర : రూ.88,150 (ఎక్స్-షోరూమ్)

ఇంజిన్ : 124.6 cc, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్

గరిష్ఠ పవర్ : 7,250 rpm వద్ద 7.3 kW

గరిష్ఠ టార్క్ : 6,000 rpm వద్ద 10.4 Nm

ట్రాన్స్‌మిషన్ : CVT, డ్రై సెంట్రిఫ్యూగల్ క్లచ్

సీటు ఎత్తు : 777 mm

ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 5 లీటర్లు

(గమనిక: ఈ ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ వి. ఆన్-రోడ్ ధర అనేది రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్ వంటి వాటి ఆధారంగా మారుతుంది.)

35
హీరో జూమ్ 125 VX, ZX వేరియంట్ల మధ్య తేడాలేంటి?

హీరో జూమ్ 125 రెండు వేరియంట్ల మధ్య ప్రధాన తేడా వాటి డిజైన్, టెక్నాలజీ ఫీచర్లలోనే ఉంది.

బ్రేకింగ్ & అలాయ్ వీల్స్ : VX మోడల్ మామూలు కాస్ట్ అలాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. అదే ZX మోడల్ మెషిన్డ్ అలాయ్ వీల్స్, ముందు వైపు డిస్క్ బ్రేక్‌తో వస్తుంది.

ఇండికేటర్స్ & లైటింగ్ : VX లో స్టాండర్డ్ ఎల్ఈడీ వింకర్స్ ఉంటే, టాప్ ఎండ్ ZX లో సీక్వెన్షియల్ ఇండికేటర్లు ఇచ్చారు.

టెక్నాలజీ & ఫీచర్లు : ప్రీమియం మోడల్ ZX లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్ట్‌తో ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్, ఇల్యూమినేటెడ్ స్టార్ట్ బటన్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

45
హీరో జూమ్ 125 ఇంజిన్, పనితీరు

హీరో జూమ్ VX, ZX రెండు వేరియంట్లలోనూ 124.6 cc ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఇచ్చారు. కాబట్టి ZX మోడల్ కోసం అదనపు డబ్బులు పెడుతున్నామంటే అది ఇంజిన్ కోసం కాదు.. డిస్క్ బ్రేక్, నావిగేషన్, ఇతర ప్రీమియం ఫీచర్ల కోసమే. ఈ స్కూటర్ 1,978 mm పొడవు, 1,327 mm వీల్‌బేస్ కలిగి ఉంటుంది. ఎగుడుదిగుడు రోడ్లపై ఈజీగా వెళ్లేందుకు 164 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు.

డ్రమ్ బ్రేక్ ఉన్న VX మోడల్ బరువు 120 కిలోలు, వెడల్పు 739 mm. డిస్క్ బ్రేక్ ఉన్న ZX మోడల్ బరువు 121 కిలోలు, వెడల్పు 749 mm. ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనక వైపు సింగిల్ సైడ్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు.

55
ఎవరు ఏ వేరియంట్ కొనుక్కోవాలి?

హీరో జూమ్ 125 VX వేరియంట్ : మంచి లుక్స్, బెస్ట్ మైలేజ్ ఉంటూ, రోజువారీ అవసరాలకు తక్కువ బడ్జెట్‌లో ఆటోమేటిక్ స్కూటర్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

హీరో జూమ్ ZX వేరియంట్ : ముందు వైపు డిస్క్ బ్రేక్‌తో కూడిన సేఫ్టీ, మొబైల్ ఛార్జింగ్, డిజిటల్ నావిగేషన్ లాంటి స్మార్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి ZX సరైన ఆప్షన్.

కొనే ముందు నేరుగా షోరూమ్‌కి వెళ్లి రెండు బండ్లను చూసి, సీటు కంఫర్ట్, మీకు కావాల్సిన ఫీచర్లు సరిచూసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories