Hero Vida VX2 : హీరో నుంచి అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కి.మీ. వెళ్తుందంటే?

Published : Jul 20, 2025, 12:38 PM IST

Hero Vida VX2 Electric Scooter Features: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. హీరో నుంచి అదిరే ఫీచర్లతో హీరో విడా VX2 అనే కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్ రేంజ్ ఎంత? ఫీచర్లు ఏంటో? ఓ లూక్కేయండి.

PREV
19
విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఓ శుభవార్త. హీరో నుంచి అదిరే ఫీచర్లతో హీరో విడా VX2  అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ ప్రస్తుతం స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఫ్రెండ్లీ బడ్జెట్ లో అందుబాటులో ఉండే ఈ బైక్ ప్రత్యేకతలేంటో ఓ లూక్కేయండి. 

29
ఒక్కసారి చార్జ్‌తో

హీరో విడా VX2 ప్రధాన ప్రత్యేకతల్లో బ్యాటరీ సిస్టమ్ ఒకటి. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే 140 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం. దీనికి రిమూవబుల్ డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్ ఉండటం వల్ల, ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేయడం లేదా అవసరమైనప్పుడు త్వరగా మార్చుకోవచ్చు. ఇది నగర జీవనశైలికి ఎంతో అనువుగా మారుతోంది.

39
రెండు వేరియంట్లలో

హీరో విడా VX2 రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 

  • విడా VX2 గో: 2.2 kW బ్యాటరీతో 92 కి.మీ. రేంజ్
  • VX2 Plus: 3.4 kW పవర్ యూనిట్‌తో 142 కి.మీ. వరకు ప్రయాణించగలదు
49
స్టైల్, కంఫర్ట్, టెక్నాలజీ కలబోత

కంఫర్టబుల్ సీట్, విశాలమైన బూట్ స్పేస్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్‌, ఫుల్ LED లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అదిరిపోయే ప్యూచర్లతో యువత మెచ్చేలా ఉంది.

59
అధునాతన డిస్‌ప్లే, స్మార్ట్ కనెక్టివిటీ

హీరో విడా VX2 ప్లస్‌‍లో 4.3 అంగుళాల TFT స్క్రీన్ అందించబడగా, విడా VX2 గోలో 4.3 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్కూటర్లు రైడ్ స్టాటిస్టిక్స్, టెలిమెట్రీ, ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ వంటి సమాచారాన్ని అందించడంలో ముందుండే విధంగా రూపొందించబడ్డాయి. అంతేకాదు..  స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సౌకర్యం ద్వారా రైడింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మార్చుకోవచ్చు.

69
ఫాస్ట్ చార్జింగ్

విడా VX2 స్కూటర్‌లో ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం మరో ప్రధాన ఆకర్షణ. కేవలం 60 నిమిషాల్లో 80% వరకు బ్యాటరీ చార్జ్ అయ్యే ఈ ఫీచర్, ప్రయాణదారులకు సమయాన్ని ఆదా చేస్తుంది. 

79
రైడింగ్ ఫీచర్లు

విడా VX2 స్కూటర్‌ హబ్ మోటార్‌తో వస్తోంది, ఇది ఎకో, రైడ్, స్పోర్ట్ వంటి రైడింగ్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. రివర్స్ అసిస్ట్ ద్వారా స్కూటర్‌ను తేలికగా తిరగవచ్చు. అలాగే.. రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉన్నందున బ్రేక్ వేయడంలోనూ, బ్యాటరీకి పునఃఛార్జింగ్‌లోనూ ఇది సహాయపడుతుంది.

89
అధునాతన భద్రతా

అధునాతన భద్రతా ఫీచర్లు హీరో విడా VX2 మరో ప్రత్యేక ప్యూచర్. అత్యాధునిక రిమోట్ ఇమ్మొబిలైజేషన్, క్లౌడ్ కనెక్టివిటీ వంటి భద్రతా లక్షణాలు కలిగి ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా స్కూటర్‌ను ట్రాక్ చేయడం, లాక్ చేయడం, ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ చేయడం వంటి పనులను సులభంగా చేయొచ్చు. క్లౌడ్ బేస్డ్ కనెక్టివిటీ వల్ల రైడింగ్ డేటా, భద్రత మరింత మెరుగవుతుంది.

99
ధర

హీరో విడా VX2 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹99,490గా నిర్ణయించబడింది. అయితే, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ద్వారా మరింత చవకగా పొందొచ్చు. ఈ ప్లాన్ కింద స్కూటర్ ధర కేవలం ₹59,490 మాత్రమే. అంటే ₹60,000 కంటే తక్కువ ధరకే ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories