విడా Vx2 ఎకో, రైడ్, స్పోర్ట్స్ వంటి బహుళ రైడింగ్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది వినియోగదారులు తమ రైడింగ్ శైలికి అనుగుణంగా పనితీరును సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
ఇక ఈ స్కూటర్‌లో రివర్స్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్, సైడ్-స్టాండ్ సెన్సార్‌లు వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి, ఇవి రైడర్ సౌకర్యం, భద్రతను పెంచుతాయి. ఈ స్కూటర్ 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో రోడ్లపైకి వస్తుందని అంచనా.