Toyota Glanza Prestige: 6 ఎయిర్‌బ్యాగ్‌లతో గ్లాంజా ప్రెస్టీజ్ ఎడిషన్.. సేప్టీ, స్టైల్‌కు సరికొత్త నిర్వచనం..

Published : Jul 20, 2025, 10:09 AM IST

Toyota Glanza Prestige Edition:  కారు అంటే స్టైల్ మాత్రమే కాదు భద్రత కూడా ముఖ్యమే. ఈ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని టొయోటా కొత్తగా గ్లాంజా ప్రెస్టీజ్ ఎడిషన్‌ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త గ్లాంజా ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

PREV
110
సేప్టీకి కొత్త నిర్వచనం

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తాజాగా గ్లాంజా కొత్త ప్రెస్టీజ్ ఎడిషన్ ను  మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ వేరియంట్‌ లో ప్రధానంగా భద్రతపై దృష్టి సారించారు.  

210
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

ఇప్పటి నుంచి గ్లాంజా అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. ఇది డ్రైవర్‌తో పాటు ప్రయాణికులందరికీ మరింత భద్రత కల్పిస్తుంది.  ప్రీమియం డిజైన్, ఆధునిక సాంకేతికతతో రూపొందిన గ్లాంజా ఇప్పటికే పలువురి మన్ననలు పొందింది. సేఫ్టీ ఫీచర్లు  మెరుగవడంతో ఈ కొత్త గ్లాంజా మరింత ఆకర్షణీయంగా మారింది. 

310
ప్రముఖ మోడళ్లకు పోటీగా

డ్రైవర్లు, ప్రయాణీకుల భద్రతకు ప్రాముఖ్యతనిస్తూ టొయోటా గ్లాంజాలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా అమర్చింది. ఈ నిర్ణయం వల్ల గ్లాంజా ఉన్నత శ్రేణిలోని కార్ల భద్రతా ప్రమాణాలతో పోటీ పడబోతుంది. భద్రతతో పాటు స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ టొయోటా గ్లాంజా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. 

410
డిజైన్

స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, ఈజీ  మెయింటెనెన్స్ తో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉండటం గ్లాంజాను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. భద్రమైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా నిలబెడుతోంది. 

510
ప్రెస్టీజ్ ప్యాకేజీ

గ్లాంజాలో భద్రతా అప్‌గ్రేడ్‌లతో పాటు, టొయోటా తాజాగా "ప్రెస్టీజ్ ప్యాకేజీ" అనే ప్రత్యేక యాక్సెసరీ బండిల్‌ను పరిచయం చేసింది. జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ ప్యాకేజీ ద్వారా వాహనం స్టైలింగ్, ఇంటీరియర్ లుక్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరిచేలా రూపొందించిన ఈ కాస్మెటిక్ యాడ్-ఆన్‌లు ప్రీమియం లుక్‌ను కోరుకునే వారిని ఆకట్టుకుంటాయి. 

610
ఆకర్షణీయమైన యాక్సెసరీలు

గ్లాంజా ప్రెస్టీజ్ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటంటే..  దాని ప్రత్యేకమైన స్టైలింగ్ ఎలిమెంట్లు. ఈ ప్యాకేజీలో క్రోమ్ ట్రిమ్ చేసిన బాడీ సైడ్ మోల్డింగ్‌లు, ప్రీమియం డోర్ వైజర్లు, రియర్ ల్యాంప్ గార్నిష్, లోయర్ గ్రిల్ గార్నిష్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, రియర్ స్కిడ్ ప్లేట్ వంటి కాస్మెటిక్ యాడ్-ఆన్‌లు ఉన్నాయి. ఈ యాక్సెసరీలు డీలర్ల ద్వారా ఐచ్ఛికంగా అందుబాటులో ఉంటాయి. వీటితో గ్లాంజా లుక్ మరింత స్టైలిష్‌గా, ప్రీమియంగా కనిపిస్తోంది. 

710
ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, మైలేజీ విశేషాలు

ఈ గ్లాంజాలో ఇంజన్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటిలాగే 1.2 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. 

ఇది మాన్యువల్ (MT),  ఆటోమేటిక్ (AMT) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే, సిజిఎన్‌ (CNG) వేరియంట్లలో కూడా ఈ మోడల్ అందుబాటులో ఉంది.

మైలేజీ విషయానికి వస్తే.. AMT వెర్షన్ మైలేజీ లీటరుకు 22.94 కి.మీ,  CNG మోడల్ మైలేజీ: కిలోకు 30.61 కి.మీ.  

810
రంగుల ఎంపికలలో విశిష్టత

టొయోటా గ్లాంజా కొత్త ప్రెస్టీజ్ ఎడిషన్ పలు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంది. వీటిలో:  గేమింగ్ గ్రే, ఇన్‌స్టా బ్లూ, స్పోర్టింగ్ రెడ్, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్ కలర్స్  అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు  టూ-టోన్ , సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతున్నాయి. ప్రత్యేకించి స్టైలింగ్‌కి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు ఈ కలర్ వేరియంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

910
ఫీచర్లు

9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, 45కి పైగా కనెక్ట్ చేయబడిన సామర్థ్యాలతో కూడిన టొయోటా ఐ-కనెక్ట్ వంటి వాహన ఫీచర్ జాబితా అలాగే ఉంది. రియర్ AC వెంట్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

1010
వారంటీ

టొయోటా గ్లాంజా ప్రెస్టీజ్ ఎడిషన్‌కి ప్రామాణికంగా మూడు సంవత్సరాలు లేదా 100,000 కి.మీ వారంటీ లభిస్తుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఈ వారంటీని ఐదు సంవత్సరాలు లేదా 220,000 కి.మీ వరకు పొడిగించుకునే వీలుంది.

  • 60 నిమిషాల ఎక్స్‌ప్రెస్ మెయింటెనెన్స్ సర్వీస్
  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ .. ఇవి టొయోటా అందించే అదనపు సౌకర్యాలు. హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులకు ఈ సేవలు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి.
Read more Photos on
click me!

Recommended Stories