తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే హీరో Vida VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. బడ్జెట్ ధరలో, అదిరిపోయే ఫిీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హీరో Vida VX2 స్కూటర్: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ.. హీరో మోటోకార్ప్ విడుదల చేసిన హీరో Vida VX2 ఎలక్ట్రిక్ స్కూటర్.. దాని ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
24
హీరో Vida VX2 బ్యాటరీ
హీరో Vida VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 110 కిలోమీటర్ల వరకు సులభంగా వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హై పెర్ఫార్మెన్స్, హై టార్క్‌ను ఉత్పత్తి చేసే BLDC మోటార్ ఉంది. ఇది గంటకు 80 నుంచి 85 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 3 సెకన్లలో ఈ స్కూటర్ 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
34
హీరో Vida VX2 ఫీచర్లు
హీరో Vida VX2 ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. కంపెనీ ఇందులో పూర్తిగా ఆధునిక ఫీచర్లను జోడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.3 అంగుళాల పూర్తి LED డిస్ప్లే ఉంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, క్లౌడ్ కనెక్టివిటీ, రిమోట్ కనెక్టివిటీతోపాటు.. LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, LED ఇండికేటర్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి వ్యవస్థలు ఉన్నాయి.
హీరో Vida VX2 ధర చాలా తక్కువ. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుండటంతో, ధర తక్కువగా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ 85,858 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి 15 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది. డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లతో ఈ స్కూటర్‌ను రూ. 45,000 కే కొనుగోలు చేయవచ్చు.