రోజూ ఆఫీసులకు, పనులకు వెళ్లేవారికి హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 రెండూ మంచి ఆప్షన్లు. ధర, మైలేజ్, లుక్.. ఇలా అన్ని అంశాల్లో వీటిలో ఏది బెస్ట్ అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు రోజూ చాలా దూరం ప్రయాణిస్తారా..? మంచి మైలేజ్ ఇచ్చే, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే బడ్జెట్ బైక్ కోసం చూస్తున్నారా..? అయితే హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 మీకు సరైనవి. ఆఫీసులకు వెళ్లేవాళ్లు, డెలివరీ ఏజెంట్లు, చిన్న వ్యాపారులకు ఈ బైక్‌లు బాగా నచ్చుతాయి.
24
స్ప్లెండర్ ప్లస్ vs ప్లాటినా 100.. దేని ధర తక్కువ..?
బడ్జెట్ విషయానికొస్తే, హీరో స్ప్లెండర్ ప్లస్‌తో పోలిస్తే బజాజ్ ప్లాటినా 100 ధర తక్కువ. తక్కువ బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునేవారికి ప్లాటినా మంచి ఆప్షన్. స్ప్లెండర్ ప్లస్ ధర కొంచెం ఎక్కువైనా, దాని మన్నిక, నమ్మకమైన పనితీరుకు పేరుంది.
బజాజ్ ప్లాటినా 100 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.68,000 కాగా, హీరో స్ప్లెండర్ ప్లస్ ధర సుమారు రూ.76,000. అంటే, రెండింటి మధ్య దాదాపు రూ.8,000 తేడా ఉంది.
34
స్ప్లెండర్ ప్లస్ vs ప్లాటినా 100... మైలేజ్ లో ఏది బెస్ట్..?
మైలేజ్ విషయంలో ఈ రెండు బైక్‌లూ అదరగొడతాయి. కంపెనీల సమాచారం ప్రకారం… హీరో స్ప్లెండర్ ప్లస్ లీటర్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే బజాజ్ ప్లాటినా 100 లీటర్‌కు 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్‌తో స్ప్లెండర్ ప్లస్ సుమారు 680 కిలోమీటర్లు వెళ్తే, ప్లాటినా 100 ఏకంగా 800 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ చెబుతోంది. కాబట్టి ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి ప్లాటినా మంచి ఎంపిక.
స్ప్లెండర్ ప్లస్ vs ప్లాటినా 100.. ఇతర ఫీచర్లలో ఏది బెస్ట్..?
హీరో స్ప్లెండర్ ప్లస్‌లో కంపెనీకి చెందిన i3S టెక్నాలజీ ఉంది. ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బైక్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసి, మళ్లీ స్టార్ట్ చేసేటప్పుడు ఆన్ చేయడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేస్తుంది. సైడ్-స్టాండ్ వేస్తే ఇంజిన్ ఆఫ్ అయ్యే సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది.
బజాజ్ ప్లాటినా 100 సౌకర్యవంతమైన ప్రయాణానికి పెట్టింది పేరు. దీని సస్పెన్షన్ గతుకుల రోడ్లపై కూడా కుదుపులను తగ్గించి, హాయిగా ప్రయాణించేలా చేస్తుంది.