ఈవి కార్ల ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉండటానికి కారణాలివే..
EV వాహనాల్లో అసలు ఖర్చు బ్యాటరీదే
ఎలక్ట్రిక్ కారులో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీనే. కొన్ని మోడళ్లలో కారు మొత్తం ధరలో 30 నుంచి 50 శాతం బ్యాటరీదే ఉంటుంది. ప్రమాదాలు, వరదలు, మంటలు, షార్ట్ సర్క్యూట్ వంటి కారణాలతో బ్యాటరీ దెబ్బతింటే దాన్ని బాగుచేయించడానికి లేదా మార్చడానికి లక్షల్లో ఖర్చవుతుంది. ఈ రిస్క్‌ను దృష్టిలో పెట్టుకునే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయి.
EV కారు రిపేర్ ఖర్చులు కూడా ఎక్కువే
ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, సెన్సర్లు, కంట్రోల్ యూనిట్లు, సాఫ్ట్‌వేర్ ఉంటాయి. వీటి రిపేర్లకు ప్రత్యేక శిక్షణ పొందిన టెక్నీషియన్లు, ప్రత్యేక సర్వీస్ సెంటర్లు అవసరం. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే రిపేర్ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం పెరగడానికి ఒక కారణం.