Vehicle Insurance : వర్షాలు, వరదల్లో మీ బైక్ లేదా కారు పాడయితే.. ఇన్సూరెన్స్ వస్తుందా, రాదా?

Published : Jul 21, 2026, 05:12 PM IST

భారీ వర్షాలప్పుడు రోడ్లన్నీ నీటితో నిండిపోవడం ఇప్పుడు మామూలైపోయింది. ఇలాంటి టైంలో మీ కారు లేదా బైక్ నీళ్లలో చిక్కుకుని పాడైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా? ఈ డౌట్ చాలామందికి వస్తుంది. మరి ఇన్సూరెన్స్ కంపెనీల రూల్స్ ఏం చెబుతున్నాయి?

PREV
15
వర్షాలు, వరదల్లో వెెహికిల్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ వస్తుందా?

ప్రతి వర్షాకాలంలో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం, గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోవడం, చెట్లు విరిగిపడి కార్లు దెబ్బతినడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇటీవల కాలంలో అకాల వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ ఎక్కువైపోయాయి… దీంతో  వాహనాల డ్యామేజ్ మరింత ఎక్కువయ్యింది. వరద నీటిలో కార్ల, బైక్స్ కొట్టుకుపోయే వీడియోలు సోషల్ మీడియాాలో వైరల్ గా మారిన సందర్భాలెన్నో.

అయితే ఇలా వర్షాలు, వరదల్లో వెహికిల్స్ డ్యామేజ్‌ అయితే ఇన్సూరెన్స్ కవర్ అవుతుందో, లేదో చాలామందికి తెలియదు. అసలు నిజం ఏంటంటే ఇలా ప్రకృతి వైపరిత్యాల కారణంగా వాహనాలు డ్యామేజ్ అయితే అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కవరేజీ ఇవ్వవు. కొన్ని ప్రత్యేక పాలసీలు మాత్రమే కవరేజీ అందిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

25
ఏ పాలసీ తీసుకుంటే వర్షాలు, వరదలకు ఇన్సూరెన్స్ వస్తుంది?

చాలామంది వాహనదారులు కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే కలిగి ఉంటారు.. ఇది కేవలం మన వాహనం వల్ల ఇతరులకు జరిగే నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగినా ఎదురువాటికి మాత్రమే పరిహారం దక్కుతుంది. ఇక వర్షం, వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీ సొంత వాహనానికి జరిగే నష్టానికి ఇందులో పరిహారం రాదు. 

అయితే థర్డ్ పార్టీ కాకుండా కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే వర్షాలు, వరదల వల్ల మీ వాహనం పాడైనా డబ్బులు వస్తాయి. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల వెహికిల్ దెబ్బతిన్నా నష్టాలకు క్లెయిమ్ చేసుకోగలరని నిపుణులు చెబుతున్నారు.

35
ఏమిటీ కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ?

సాధారణంగా కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ.. వరదలు, నీరు నిలిచిపోవడం, కొండచరియలు విరిగిపడటం, చెట్లు కూలడం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. కాబట్టి భారీ వర్షం వల్ల మీ వాహనం పాడైతే, పాలసీ నిబంధనలకు లోబడి పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అయినా పాలసీ షరతులు, కవరేజీ పరిమితులను ముందుగానే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

45
ఇలా చేశారో కాంప్రహెన్సివ్ పాలసీ కూడా కవర్ కాదు..

వర్షపు నీటిలో వాహనం ఆగిపోతే, చాలామంది వెంటనే దాన్ని మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంజిన్‌లోకి నీరు చేరినప్పుడు మళ్లీ స్టార్ట్ చేస్తే, ఇంజిన్ దెబ్బతింటుంది. దీన్ని 'పర్యవసాన నష్టం' (Consequential Loss) అంటారు. సాధారణ కాంప్రహెన్సివ్ పాలసీలో ఈ నష్టం అస్సలు కవర్ కాదు. దీనికోసం ప్రత్యేకంగా 'ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్' ఉంటేనే చాలా సందర్భాల్లో పరిహారం లభిస్తుంది. కాబట్టి వరదల్లో చిక్కుకున్న వాహనాన్ని నడపకుండా, వెంటనే టోయింగ్ సర్వీస్‌కు కాల్ చేసి, అధీకృత సర్వీస్ సెంటర్‌కు పంపడం మంచిది.

55
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వర్షాకాలంలో వాహనాన్ని కాపాడుకోవడం అనేది డ్రైవర్ జాగ్రత్త, సరైన ఇన్సూరెన్స్ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్, అవసరమైన యాడ్-ఆన్‌లు తీసుకోవడం ద్వారా అనుకోని ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవచ్చు. వరద నీటిలో చిక్కుకున్న వాహనాన్ని రీస్టార్ట్ చేయకుండా, వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇచ్చి, వారి గైడెన్స్ ప్రకారం క్లెయిమ్ ప్రాసెస్ మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read more Photos on
click me!

Recommended Stories