Best EV Scooter : బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్.. ఇందులో బెస్ట్ ఈవి ఏది?

Published : Nov 05, 2026, 01:03 PM ISTUpdated : Nov 05, 2026, 01:08 PM IST

ఇండియాలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ వాడకం రోజురోజుకి పెరుగుతోంది… ముఖ్యంగా బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్ స్కూటర్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. వీటిలో ఏది బెస్ట్ అనేది ఇక్కడ చూద్దాం.

PREV
15
ఇండియాలో బెస్ట్ స్కూటర్ ఏది?

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో రోజువారి అవసరాలకోసం వాడే స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. కస్టమర్లకు మెరుగైన బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ అందించేందుకు కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బజాజ్ కు చెందిన చేతక్ (Bajaj Chetak), టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), ఏథర్ రిజ్టా (Ather Rizta), ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X) స్కూటర్లు నేరుగా తలపడుతున్నాయి… మరి 2026 నవంబర్ నాటికి బెస్ట్ స్కూటర్ ఏది?

25
బజాజ్ చేతక్ ఈవీ (Bajaj Chetak EV)

బజాజ్ ఆటో 2026 అప్‌డేట్ ప్రకారం… చేతక్ 'సీ సిరీస్' చాలా వేరియంట్లలో వస్తోంది. ఇందులో C3501, C3502 మోడల్స్ 3.5 kWh బ్యాటరీతో 153 కి.మీ రేంజ్ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక C3503 మోడల్ 151 కి.మీ రేంజ్ ఇస్తుంది. C3001, C2501 మోడల్స్ వరుసగా 127 కి.మీ, 113 కి.మీ రేంజ్ ఇస్తాయి.

C3501, C3502 మోడల్స్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా కంపెనీ చెబుతోంది. C3501లో టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ఉన్నాయి. C35, C30 మోడల్స్ 35 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇస్తే, C25 మోడల్ 25 లీటర్ల స్టోరేజ్ ఇస్తుంది.

35
టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్ లలో ఏది బెస్ట్?

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) కస్టమర్ల కోసం చాలా బ్యాటరీ ఆప్షన్లు తెచ్చింది. 3.5 kWh మోడల్ 145 కి.మీ ఐడీసీ రేంజ్, 4.7 kWh ఉన్న 'ఐక్యూబ్ ఎస్' (iQube S) 175 కి.మీ రేంజ్ ఇస్తాయని కంపెనీ చెబుతోంది.

ఇక ఏథర్ రిజ్టా (Ather Rizta) ముఖ్యంగా ఫ్యామిలీ ప్రయాణం కోసం డిజైన్ చేసిన స్కూటర్. ఇది 159 కి.మీ రేంజ్ కలిగివుండి, 34 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తుంది. 'Z' వేరియంట్‌లో టచ్‌స్క్రీన్, గూగుల్ మ్యాప్స్ ఆప్షన్లు ఉన్నాయి.

ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X) లో 2 kWh బ్యాటరీ కలిగినది 108 కి.మీ రేంజ్, 3 kWh బ్యాటరీ కలిగినది 176 కి.మీ రేంజ్, 4 kWh బ్యాటరీ కలిగినది ఏకంగా 242 కి.మీ రేంజ్ ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక S1 X+ మోడల్ 5.2 kWh బ్యాటరీతో 320 కి.మీ రేంజ్, 125 కి.మీ టాప్ స్పీడ్ ఇస్తుందట.

45
ఛార్జింగ్ టైమ్, రోడ్ ఎక్స్‌పీరియన్స్

స్కూటర్ కొనేటప్పుడు దాని ఛార్జింగ్ టైమ్ కూడా చూసుకోవాలి. బజాజ్ చేతక్ 0-80% ఛార్జ్ అవ్వడానికి C3501 మోడల్‌కు 3 గంటలు, C3502, C3503 మోడల్స్‌కు 3 గంటల 25 నిమిషాలు పడుతుంది. C3001 మోడల్‌కు 2 గంటల 55 నిమిషాలు పడుతుంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ 3.5 kWh మోడల్ 10% నుంచి 80% ఛార్జ్ అవ్వడానికి 3 గంటల 45 నిమిషాలు పడుతుందని కంపెనీ చెబుతోంది.

55
ఏ స్కూటర్ కొంటే బెటర్?

మెటల్ బాడీ, క్లాసిక్ లుక్ కావాలంటే బజాజ్ చేతక్ బెస్ట్ ఆప్షన్. ఎక్కువ దూరం వెళ్లాలంటే టీవీఎస్ ఐక్యూబ్ తీసుకోవచ్చు. ఫ్యామిలీకి సరిపోయే స్పేస్, కంఫర్ట్ కావాలంటే ఏథర్ రిజ్టా చూడొచ్చు. ఎక్కువ రేంజ్, స్పీడ్ కావాలంటే ఓలా ఎస్1 ఎక్స్+ సెట్ అవుతుంది.

అయితే ఐడీసీ రేంజ్ అనేది టెస్టింగ్ కండిషన్స్‌లో వస్తుంది. ట్రాఫిక్, స్పీడ్, బరువు, రోడ్డు, వాతావరణం బట్టి రియల్ రేంజ్ మారుతుంది. కాబట్టి టెస్ట్ డ్రైవ్ చేశాకే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories