ఈ రాశులవారికి... పుట్టుకతోనే న్యాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకుంటారు..!

First Published Nov 12, 2021, 1:10 PM IST

ఇతరులకు న్యాయకత్వం వహిస్తూ ఉంటారు. ఇతరులకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు.  ఏ విషయాన్ని అయినా పోరాడే శక్తి వీరికి ఉంటుంది. అలాంటివారు ఎవరు అనే విషయాన్ని జోతిష్య శాస్త్రం ప్రకారం  చెప్పేయవచ్చట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..
 

astrology

కొన్ని కొందరికి పుట్టకుతోనే వచ్చేస్తాయి. వాటిలో ధైర్యం, న్యాయకత్వ లక్షణాలు ఇలానే చాలానే ఉంటాయి. అలానే కొందరికి పుట్టుకుతనే బలమైన స్పిరిట్ కలిగి ుంటారు. ఈ బలమైన స్పిరిట్ కలిగినవారు.. ఇతరులకు న్యాయకత్వం వహిస్తూ ఉంటారు. ఇతరులకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు.  ఏ విషయాన్ని అయినా పోరాడే శక్తి వీరికి ఉంటుంది. అలాంటివారు ఎవరు అనే విషయాన్ని జోతిష్య శాస్త్రం ప్రకారం  చెప్పేయవచ్చట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా అద్భతమైన నాయకులుగా గుర్తింపు పొందుతారు. వీరికి బలం కూడా చాలా ఎక్కువ. వారి బలంతో దేన్నైనా తారుమారు చేయగలరు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తాము నమ్మిందే నిజమని నమ్ముతుంటారు. ఎలాంటి సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కోగలరు. సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా తాము బలంగా మారతామని వారు భావిస్తుంటారు.


మేష రాశి..
ఈ రాశివారు చాలా ప్రాక్టికల్. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అదే వీరిని అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. వారి జీవితంలో ప్రతి కోణంలోనూ అన్ని విషయాలను ఆలోచిస్తారు. చాలా బాధ్యతగా ఉంటారు. అన్నింట్లోనూ ముందుంటారు. ఏ విషయంలోనూ వెనకపడాలని అనుకోరు.


సింహ రాశి..
ఈ రాశివారు చాలా శక్తివంతంతగా ఉంటారు. ఎలాంటి కష్టాన్నైనా పడగొట్టేస్తారు. వీరు తమ జీవితంలో రాజులాగా బతకాలని అనుకుంటారు. అదేవిధంగా బతుకుతారు కూడా. చాలా నిజాయితీగా ఉంటారు. ఇతరులు తమతో అబద్దాలు చెప్పినా.. వారిని చాలా దయతో చూస్తుంటారు. వీరు పుట్టుకుతోనే  చాలా బలమైన వ్యక్తులు.. అన్ని విషయాల్లో వీరికి నియంత్రణ ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశివారికి చాలా బలం ఉంటుంది. అయితే.. ఆ బలాన్ని అందరి ముందు ప్రదర్శించడం వీరికి నచ్చదు. వీరి ఎమోషన్సే వీరికి బలం. వారి వ్యక్తిగత ఎదుగుదలపై ఎక్కువ దృష్టి పెడతారు. వారు సులభంగా వదులుకోరు .అది వారు కలిగి ఉన్న మెగా-బలం, అది వారిని మిగిలినవారిలో బలంగా చేస్తుంది.

కుంభ రాశి..
కుంభరాశి వారికి స్వీయ నియంత్రణ చాలా ఎక్కువ. వారు పరిస్థితులకు ప్రతిస్పందించరు .  ప్రతిదీ విశ్లేషించడానికి వీరు సమయాన్ని వెచ్చిస్తారు. వారు ఏదైనా అడుగు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు .  అది ఒక మెచ్చుకోదగిన గుణం. ఎమోషన్స్ కి అంత తొందరగా కుంగిపోరు. మిగిలిన వారితో పోలిస్తే.. వీరికి ఆత్మబలంగా ఉంటారు. 

click me!