వామ్మో... ఈ రాశి పిల్లలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం..!

First Published | Nov 24, 2021, 11:53 AM IST

ఒక్కొక్కరు ఒక్కోలా వారికి నచ్చిన విధంగా ఉంటారు. అయితే.. కొందరు మాత్రం భరించలేని అల్లరి చేస్తుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం... ఏ రాశి పిల్లలను భరించేలమో ఇప్పుడు చూద్దాం..
 

kids

పిల్లలు చాలా విలువైనవారు.  వారి ముఖంలో అమాయకత్వం తాండవిస్తూ ఉంటుంది. పిల్లలు.. ప్రేమకు ప్రతిరూపం. అయినప్పటికీ.. ఒక్కోసారి.. వాళ్లను హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా వారికి నచ్చిన విధంగా ఉంటారు. అయితే.. కొందరు మాత్రం భరించలేని అల్లరి చేస్తుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం... ఏ రాశి పిల్లలను భరించేలమో ఇప్పుడు చూద్దాం..

1.మేష రాశి..
మేషరాశికి చెందిన పిల్లలు తమ అభిప్రాయాల విషయానికి వస్తే చాలా ప్రతిష్టాత్మకంగా, అంకితభావంతో , చాలా మొండిగా ఉంటారు.  వీరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం.ప్రజలు ఇచ్చే సలహాలను వీరు పట్టించుకోరు. తాము చేయాలి అనుకున్నది మాత్రమే చేస్తారు.  ఎదుటివారితో వాదనలు పెట్టుకుంటారు. తగాదాలు  పెట్టుకుంటూ ఉంటారు.


2.వృషభ రాశి..
వృషభ రాశి కి చెందిన పిల్లలు చాలా మొండిగా ఉంటారు.  ఎవరితోనూ కలవరు. కేవలం తమ కంఫర్ట్ జోన్ లో మాత్రమే ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశి పిల్లలను..  తమ తల్లిదండ్రులు ఎంత సోషలైజ్ చేద్దామని ప్రయత్నించినా.. వారి వల్ల కాదు. ఈ రాశి పిల్లలు.. అంత తేలికగా.. చెప్పేది వినరు. వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం.

3.కన్య రాశి..
కన్య రాశివారు చిన్న తనం నుంచే ప్రతి విషయంలోనూ పరిపూర్ణంగా ఉంటారు. వీరికి అన్నీ గొప్ప లక్షణాలు ఉంటాయి. కానీ.. ప్రతి విషయానికీ తమను తాము విమర్శించుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు  ఎంత నచ్చచెబుతామని ప్రయత్నించినా.. పట్టించుకోరు. తాము అనుకున్నదే  సాధించాలని పట్టుదలగా ఉంటారు. అది మంచి, చెడు అనేది వినరు.

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశి పిల్లల విషయానికి వస్తే... వీరు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు.  తమతోపాటు సమానం గా ఇతరులు ఎవరైనా ఉంటే తట్టుకోలేరు. అన్ని విషయాలను తారుమారు చేయాలని చూస్తుంటారు. ఏ విషయంలోనూ రాజీ పడరు. అనుకున్నదే జరగాలని పట్టుపడతారు. ఈ విషయం పేరెంట్స్ ని బాగా ఇబ్బంది పెడుతుంది.

5.కుంభ రాశి..
ఈ రాశివారు అందరితోనూ చొరవగా ఉంటారు. అయితే.. తల్లిదండ్రులు  చెప్పిన మాట మాత్రమే వింటారు అనుకుంటే మాత్రం పొరపడినట్లే. అలా కాకుండా.. ఏదైనా వారికి నచ్చినట్లు చేయకపోతే.. తల్లిదండ్రులకు కూడా దూరంగా వెళ్లిపోతారు. అందరికీ దూరంగా వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

Latest Videos

click me!