Zodiac signs: ఈ రాశులవారిపై లక్ష్మీ కటాక్షం ఎక్కువ, డబ్బు లోటు ఉండదు..!
రెండు రాశులపై లక్ష్మీ దేవి ఎప్పుడూ మక్కువ చూపిస్తుందట. ఆమె అనుగ్రహంతో.. ఈ రెండు రాశులవారికి దాదాపు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆర్థిక సమస్యలు రావట.
రెండు రాశులపై లక్ష్మీ దేవి ఎప్పుడూ మక్కువ చూపిస్తుందట. ఆమె అనుగ్రహంతో.. ఈ రెండు రాశులవారికి దాదాపు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆర్థిక సమస్యలు రావట.
హిందూ జోతిష్యశాస్త్రంలో ప్రతి రాశికీ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అంతేకాదు.. ఒక్కో రాశి ఒక గ్రహం సొంత రాశి కూడా అవుతుంది. అదేవిధంగా కొన్ని రాశులపై ప్రత్యేకంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా రెండు రాశులపై లక్ష్మీ దేవి ఎప్పుడూ మక్కువ చూపిస్తుందట. ఆమె అనుగ్రహంతో.. ఈ రెండు రాశులవారికి దాదాపు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆర్థిక సమస్యలు రావట. మరి ఆ రెండు రాశులేంటో చూద్దాం..
1.వృషభ రాశి..
వృషభ రాశికి కుక్ర గ్రహం అధిపతి. ఈ రాశివారు సౌందర్యం, సంగీతం, కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వీరు జీవితం పట్ల ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు. కాగా, ఈ రాశివారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి డబ్బు సమస్యలు రావు. అవసరానికి ఏదో ఒక రూపంలో అయినా వీరికి డబ్బు అందుతుంది. అంతేకాదు.. ఈ రాశివారు వృథాగా ఖర్చులు చేయరు. ఆచి తూచి ఖర్చు చేస్తారు. దీర్ఘకాలిక లాభాలను లక్ష్యంగా పెట్టుకుని వ్యయ నియంత్రణతో జీవిస్తారు. అందుకే లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.
2.తుల రాశి..
తుల రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారిని కూడా శుక్రుడు పరిపాలిస్తాడు. ఈ రాశి వారికి పుట్టుకతోనే చక్కటి మాట్లాడే శైలి ఉంటుంది. అందరితోనూ మంచి అనుబంధం కలిగి ఉంటారు. సమతుల్యంగా ఆలోచించే వీరు సమస్యలను చక్కగా పరిష్కరిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో తెలివైన పెట్టుబడులు పెడతారు, ఆర్థికంగా స్థిరత పొందుతారు. వీరిని ఇతరులు గౌరవంతో చూసే స్థితికి చేరుకుంటారు. వృత్తి పరంగా అభివృద్ధి చెందేందుకు వీరికి సరైన అవకాశాలు చుట్టూ ఉంటాయి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి..?
ఎలాంటి రాశిలో పుట్టినా, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే కృషి, శ్రద్ధ, మంచి ఆచరణ అవసరం. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన చక్కని ఆలోచనలు, నైతిక విలువలు, నిజాయితీ, కష్టపడే ధోరణి కలిగి ఉంటే, దైవ అనుగ్రహం మన వెంటనే ఉంటుంది. వృషభం, తులా రాశులవారు లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఉంటారు గానీ, ప్రతి ఒక్కరూ దైవ ఆశీర్వాదంతో పాటు, మంచి మనస్సు, మేధస్సుతో ముందుకు సాగితే అదృష్టాన్ని సాధించగలరు.