Zodiac sign: వారం ఓపిక ప‌డితే చాలు.. ఈ రాశుల వారికి రాజ‌యోగం రానుంది. మేలో అదృష్ట‌మే అదృష్టం

మే నెలలో గురు గ్రహ సంచారం జ‌ర‌గ‌నుంది. దీంతో కొన్ని రాశుల వారికి రాజ‌యోగం రానుంద‌ని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. నవపంచమ రాజయోగం, శని-రాహు కలయిక, కుజ సంచారం, షష్ట రాజయోగం ప్రభావంతో మరికొన్ని రాశుల వారి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంత‌కీ ఏంటా రాశులు.? వారి జీవితాల్లో జ‌ర‌గ‌నున్న మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

May Horoscope Predictions for Four Lucky Zodiac Signs in telugu VNR

జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రాశుల గురించి, నక్షత్రాల గురించి స‌వివ‌రంగా తెల‌ప‌డం జ‌రిగింది. ప్రతి క్షణం ఈ గ్రహాలు, నక్షత్రాలు తమ స్థానాలని మార్చుకుంటూ ఉంటాయి. దీని వల్ల వివిధ యోగాలు ఏర్పడతాయి. ఈ నాలుగు రాశుల వారికి మే నెలలో గురు గ్రహ సంచారం వల్ల అదృష్టం కలిసి రానుంది. ఆ రాశులేంటో చూద్దాం.
 

May Horoscope Predictions for Four Lucky Zodiac Signs in telugu VNR

మేష రాశి: 

మేష రాశి వారికి అదృష్టం కలిసి రావచ్చు. ఉద్యోగంలో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. అనున్న ప‌నుల‌న్నీ జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు. 


Astro

వృషభ రాశి:

వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పండితులు చెబుతున్నారు. వీరికి వ‌చ్చే నెల‌లో ఆక‌స్మిక ధ‌న లాభం క‌లిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంటున్నారు. ముఖ్యంగా కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. 

సింహ రాశి: 

సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. విదేశ యాత్రలకి వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా ఉద్యోగంలో విజయాలు, వ్యాపారంలో లాభాలుంటాయని అంటున్నారు. 

మిథున రాశి:

మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. జీవితంలో అభివృద్ధి ఉంటుంది.

మే, జూన్, జూలై నెలల్లో కొన్ని యోగాలు ఏర్పడతాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి మంచి సమయం మొదలవుతుంది. ఆ రాశులేంటో చూద్దాం. 

ఏప్రిల్ 20న నవపంచమ రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావంతో కర్కాటకం, తుల, కన్య రాశుల వారికి శుభ ఫలితాలుంటాయి. 
 

మార్చి 29 నుండి మే 18 వరకు శని, రాహు కలయిక ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఇది శుభప్రదం. ఈ కలయిక ప్రభావంతో వృషభం, మకరం, తుల రాశుల వారికి లాభాలుంటాయి.

జూన్ 7 నుండి జూలై 28 వరకు కుజ సంచారం, షష్ట రాజయోగం ఏర్పడతాయి. దీని ప్రభావంతో వృశ్చికం, మిథునం, మీన రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

నోట్‌: ఈ వివ‌రాల‌ను ప‌లువురు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించ‌డం జ‌రిగింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి. 

Latest Videos

vuukle one pixel image
click me!