How many lies guys
ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి అందరూ ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తూనే ఉంటారు. కొందరు తెలిసి తప్పులు చేస్తే, మరి కొందరు తెలియకుండా చేస్తారు. ఇది చాలా కామన్. అయితే, ఎదుటివారు చేసే తప్పులను కొందరు వెంటనే క్షమించేస్తారు. కానీ.. కొందరు మాత్రం.. చిన్న తప్పును కూడా అస్సలు క్షమించరు. తప్పును మాత్రమే కాదు, చిన్న అబద్దాన్ని కూడా వీరు సహించలేరు. వారు ఎప్పుడూ తప్పు చేయరు.. ఎవరికీ అబద్ధం చెప్పరు. ఎవరైనా తమకు చెప్పినా సహించరు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..
మీరు ఎవరికి ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు?
న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తులు నిజాయితీకి ప్రసిద్ధి చెందారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు.అబద్దాలు చెప్పే వారిని అసహ్యించుకుంటారు. అబద్ధాలు చెప్పేవారినీ, తప్పులు చేసే వారినీ వీరు జీవితంలో క్షమించరు. వారితో మళ్లీ ఎప్పటికీ స్నేహం కూడా చేయరు. వారు తమను మోసం చేసినట్లు భావిస్తారు. జీవితాంతం వారిని అసహ్యించుకుంటూనే ఉంటారు.
ఇక, న్యూమరాలజీ ప్రకారం.. 2,4,6,8,11,13,15,17,20,22,24, 27, 19, 31 తేదీల్లో జన్మించిన వారు కూడా చాలా నిజాయితీగా ఉంటారు. ముఖ్యంగా తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే.. వారిని సంతోషంగా ఉంచడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్దాలు చెబుతూ ఉంటారు.ఎదుటివారు చిన్న చిన్న తప్పులు చేసినా, అబద్ధం చెప్పినా అర్థం చేసుకొని ముందుకు అడుగువేస్తారు. ఏదీ మనసుకు తీసుకోరు.
మనం జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు, మనలో ప్రతి ఒక్కరూ వివిధ రకాల వ్యక్తులను ఎదుర్కొంటారు. అందులో మనల్ని బాధపెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు కూడా ఉండొచ్చు. కానీ.. కొందరు మాత్రమే అలాంటివారిని క్షమించేసి ముందుకు వెళ్లిపోతారు. కానీ, పైన చెప్పినట్లు కొన్ని తేదీల్లో పుట్టిన వారు మాత్రం జీవితంలో క్షమించరు. అదే విషయాన్ని మనసులో పెట్టుకుంటారు. వారిని మోసగాళ్లలాగే చూస్తారు.