Zodiac sign: జనవరి రెండో వారంలో కొన్ని రాశుల వారికి కాలం కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏంటి.? ఏం జరగనుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కాలంలో శని ప్రభావం కొనసాగుతున్నా ఆదాయానికి ఆటంకం ఉండదు. పనులు కొద్దిగా ఆలస్యంగా సాగినా చివరకు పూర్తి అవుతాయి. భూములు, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక గాడిలోకి వస్తాయి. వృత్తి రంగంలో లాభాలు క్రమంగా పెరుగుతాయి. మీరు వేసే ప్రణాళికలు ఫలితం ఇస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నవారిపై అధికారులు విశ్వాసం పెంచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆర్థిక ప్రయత్నాలు సానుకూలంగా మారతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే సమయంలో ఆలోచన అవసరం. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి దూర ప్రాంతంలో అవకాశం లభించే సూచనలు ఉన్నాయి.
25
సింహ రాశి వారికి అనుకూల మార్పులు
ఈ వారం ఉద్యోగ జీవితంలో అనుకూల మార్పులు కనిపిస్తాయి. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి మంచి అవకాశాలు దక్కుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే మార్గం కనిపిస్తుంది. వైద్యులు, న్యాయవాదులు, వృత్తి నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్ధతు అందుతుంది. సోదరులతో ఉన్న ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కార దిశగా కదులుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం దక్కే సూచనలు ఉన్నాయి. ఈ దశలో ఆర్థిక హామీలు ఇవ్వడం మానుకోవడం మంచిది.
35
మిథున రాశి వారికి అనుకూలం
ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టే పనులు సులభంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు అందుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆదాయం గణనీయంగా మెరుగవుతుంది. కుటుంబ ఆస్తి వివాదాలు పరిష్కారానికి వస్తాయి. ఉద్యోగ మార్పు ఆలోచనకు అనుకూల సమయం. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువుల ద్వారా మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ పనులపై పూర్తి దృష్టి పెట్టడం లాభదాయకం.
ఈ వారం జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి అవుతాయి. ఇల్లు, వాహనానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంక్ నిల్వలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆస్తి వివాదాలకు పరిష్కార సూచనలు కనిపిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల ప్రగతి ఆనందం ఇస్తుంది.
55
కర్కాటక రాశి వారికి పని ఒత్తిడి
ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మానసికంగా కొంత భారంగా అనిపించినా ఆదాయంలో తగ్గుదల ఉండదు. ఉద్యోగాల్లో ఓర్పుతో వ్యవహరించడం అవసరం. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా ఫలితం దక్కుతుంది. చేపట్టే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగం, వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి అవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కోరుకున్న వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.