శని దేవుడు ముఖ్యమైన గ్రహం. అతను మనం చేసే పనులకు సరైన కర్మ ఫలితాలను అందిస్తాడు. అందుకే ఆయనను కర్మ దేవుడు అని పిలుచుకుంటారు. శని దేవుడికి కోపం వచ్చిందంటే ఎవరి జీవితమైన నాశనం అయిపోతుంది. ఏ వ్యక్తి అయిన తప్పు చేస్తే అతనికి తగిన శిక్షను వేసేది శనిదేవుడే. కర్మ ఫలితాలకు తగ్గ శిక్షను వేస్తాడు. అందుకే ఎవరైనా సన్మార్గంలోనే ఉండాలి. అప్పుడే ఆయన అనుగ్రహం లభిస్తుంది. న్యాయ మార్గంలో ఉండేవారికి శని దేవుడు మంచి ఫలితాలు ఇస్తాడు. శని వల్ల కలిగే అశుభ దశలలో ఏలినాటి శని, శని ధైయా ముఖ్యమైనవి.
ఏలినాటి శని ఏడున్నరేళ్లు ఉంటే… శని దైయా రెండున్నరేళ్ల పాటూ ఉంటుంది. జాతకంలో శని నాలుగో లేదా ఎనిమిదో ఇంట్లో ఉంటే శని ధైయా నడుస్తుందని అర్థం. ధైయా మొదలైతే రెండున్నరేళ్ల పాటు దాని ఫలితాలు అనుభవించాల్సిందే. ఏలినాటి శని నడిచే రాశి వారి జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. కానీ, ధైయా అంత బాధాకరంగా ఉండదు. ధైయా నడిచే రాశి వారి జీవితంలో కూడ కొన్ని సమస్యలు వస్తాయి. అనేక అడ్డంకులు ఎదురవుతాయి.