Zodiac sign: ఈ ఏడాది సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి సంక్రాంతికి ఏర్పడనున్న అరుదైన రాజయోగం కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు తీసుకురానున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2026 జనవరి 14న మకర సంక్రాంతి వస్తోంది. ఈ రోజు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య పరంగా ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సంక్రాంతికి అరుదైన రాజయోగం ఏర్పడుతోంది.
25
బుధాదిత్య రాజయోగం
జనవరి 14న సూర్యుడు, బుధుడు ఇద్దరూ ఒకే సమయంలో మకర రాశిలో సంచరిస్తారు. ఈ సంయోగం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిషాచార్యులు చెబుతున్న ప్రకారం, మకర సంక్రాంతి రోజున ఈ రాజయోగం దాదాపు 100 సంవత్సరాల తరువాత ఏర్పడుతోంది. అందుకే ఈ రోజు చాలా శుభప్రదంగా మారింది.
35
మేష రాశి ఫలితాలు
మేష రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం తొమ్మిదవ భావంలో ఏర్పడుతుంది. దీని వల్ల భాగ్యం బలపడుతుంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో లాభాలు కనిపిస్తాయి. ఊహించని విధంగా ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు, గౌరవం పెరుగుతాయి.
కన్యా రాశి వారికి ఈ రాజయోగం నాలుగో భావంలో ఏర్పడుతుంది. దీని ప్రభావంతో భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందం, సఖ్యత ఎక్కువ అవుతుంది. వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం.
55
కుంభ రాశి ఫలితాలు
కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం పదకొండవ భావంలో ఏర్పడుతుంది. దీని వల్ల ఆదాయం పెరుగుతుంది. డబ్బు వచ్చే కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మానసికంగా ప్రశాంతత అనుభూతి కలుగుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన వివరాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.