Rahu Effects 2026: 2026లో రాహువు వల్ల ఈ 2 రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్, జీతంలో పెరుగుదల

Published : Nov 19, 2025, 10:54 AM IST

Rahu Effects 2026: రాహువును పాప గ్రహంగా భావిస్తారు. కానీ ఈ గ్రహం సరైన స్థానంలో ఉంటే కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది.  రాహువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు.దీని వల్ల రెండు రాశులకు కలిసివస్తుంది.

PREV
14
రాహు సంచారం

రాహు గ్రహాన్ని దుష్ట గ్రహంగా పిలుస్తారు. రాహువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. దుష్టగ్రహాలుగా పేరుతెచ్చుకున్న రాహు, కేతువులు ఎప్పుడూ వక్ర గమనంలోనే సంచరిస్తారు. 2026లో రాహువు వల్ల కొన్ని రాశుల వారికి కలిసివస్తుంది. రాహువు కుంభరాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశి అధిపతి శనిదేవుడు.  రాహువు సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మోసుకొస్తుంది. దీని వల్ల రెండు రాశుల వారికి ఆర్థిక లాభాలతో పాటూ అదృష్టం కూడ దక్కుతుంది. ఏ రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకోండి.

24
వృషభ రాశి

రాహువు 2026లో చేసే వక్ర గమనం వల్ల వృషభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి 11వ ఇంట్లో రాహువు వక్ర గమనం జరుగుతుంది. దీనివల్ల  మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు ఇది మంచి కాలం. భారీ ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ నుంచి మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం పెరుగుదల భారీగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి వ్యాపారం విస్తరిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశివారికి సౌకర్యవంతమైన, సంపన్నమైన జీవనశైలిని పొందే అవకాశం ఉంది.

34
మిథున రాశి

మిథున రాశి వారికి రాహువు వక్ర గమనం వల్ల అనుకూలంగా సాగుతుంది. రాహువు వల్ల మీ కెరీర్ దూసుకెళ్తుంది. పని, వ్యాపారంలో పురోగతి, కొత్త అవకాశాలను అందుకుంటారు. వృత్తిపరమైన టూర్లు లాభాలను తెచ్చిపెడతాయి. మీరు కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఈ ఏడాది  మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్  పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

44
రాహువు వల్ల లాభాలు

 పై రెండు రాశుల వారికి రాహువు వచ్చే ఏడాది అనుకూలంగా ఉంటుంది. సంపద, వాక్కు పై రాహువు మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి  మీరు ఊహించని ఆర్థిక లాభాలు అధికంగా చూడవచ్చు. ఈ రెండు రాశుల వారికి మాటలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. ఎంతోమంది ఆకర్షితులవుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. 

Read more Photos on
click me!

Recommended Stories