Palmistry: హస్తసాముద్రికంలో ఒక మనిషి జీవితం, భవిష్యత్తు, చేసే ఉద్యోగం ఎలా ఉంటుందో ముందే ఊహించి చెప్పగలరు. జ్యోతిష శాస్త్రంలో హస్తసాముద్రికంలో కూడా ఒక భాగమే. ఎలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయో హస్త సాముద్రిక శాస్త్రం వివరిస్తోంది.
వేద జ్యోతిషంలో హస్త సాముద్రికం అనేది ఒక భాగం. అరచేతిని చూసి అక్కడ ఉండే గుర్తులును బట్టి ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో అంచనా వేసి చెబుతుంది. ఈ హస్త సాముద్రికంలో సూర్య, గురు పర్వతాలు ఎంతో ముఖ్యమైనవి. అరచేతిలో ఈ సూర్య, గురు పర్వతాలు ఉండే చోట కొన్ని గుర్తులు కనిపిస్తే వారికి ప్రభుత్వం రంగాలలో ఉద్యోగం లేదా విజయం దక్కే అవకాశం ఉంటుందని హస్త సాముద్రిక శాస్త్రం వివరిస్తోంది.
24
సూర్య పర్వతంపై గుర్తులు
సూర్య, గురు పర్వతాలు అంటే ఇంకేమిటో కాదు... మన వేళ్ళ కింద ఉంటే ఉబ్బు ప్రాంతాలను ఒక్కొక్క గ్రహానికి చెందిన పర్వతాలుగా చెబుతారు. సూర్య, గురు, శుక్ర, శని, చంద్ర ఇలా అన్ని గ్రహాల పర్వతాలు మన అరచేతిలో ఉంటాయి. ఫొటోలో చూపించినట్టు సూర్య, గురు పర్వతాలు ఆ ప్రదేశాలలో ఉంటాయి. సూర్య పర్వతంపై ఒక సన్నని గీత లేదా చతురస్రాకారం ఉంటే అది ఎంతో శుభప్రదం. ఇలా ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. లేదా ప్రభుత్వంతో అనుబంధం కలిగి ఉండే ఉద్యోగాలు, రాజకీయాలలో గొప్ప ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
34
గురు పర్వతంపై గుర్తులు
ఇక అరచేతిలో గురు పర్వతంపై ఉన్న చోట త్రిభుజాకారం గుర్తు ఉంటే అది ఎంతో అదృష్టంగా చెప్పుకుంటారు. వీరు ప్రభుత్వ రంగాలలో విజయాన్ని అందుకుంటారు. ఏం చేసినా కూడా మంచి గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున వీరు ఎన్నో గౌరవాలను అందుకునే అవకాశం ఉంటుంది.
ఇక సూర్య లేదా గురు పర్వతాలపై స్వస్తిక చిహ్నం కల్పిస్తే అదే అదృష్టానికి సూచనగానే చెప్పుకోవాలి. ప్రభుత్వ అనుబంధాన్ని కలిగి.. జీవితాంతం వారు ఆ రంగంలో విజయాన్ని సాధిస్తూనే ఉంటారు. సూర్య, గురు పర్వతాలు ఎత్తుగా ఉంటే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం అది శుభసంకేతమనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి కచ్చితంగా ప్రభుత్వం రంగంలో ఉద్యోగం సంపాదించి ఉన్నత పదవులను కూడా పొందుతాడు.