
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఈ వారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పనిలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కానీ ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత అవసరం.
ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు. కానీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం, ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
మిథున రాశి వారికి ఈ వారం ఉత్సాహభరితంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి.
ఈ వారం కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సింహ రాశి వారికి ఈ వారం విజయాలు దక్కుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. స్నేహితుల సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.
ఈ వారం కన్య రాశి వారికి కాస్త పరీక్షల సమయం. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. కానీ మీకు మంచే జరుగుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి ముందుకు వెళ్లాలి. ఆదాయం బాగుంటుంది కానీ.. ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి.
ఈ వారం తుల రాశి వారికి సమతుల్యత చాలా ముఖ్యం. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త భాగస్వామ్యాలు కలిసివస్తాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత, నమ్మకం పెరుగుతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి.
ఈ వారం వృశ్చిక రాశి వారికి కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అనుకోని మార్పులు లేదా బాధ్యతలు రావచ్చు. మీ సహనానికి ఇది పరీక్ష సమయం. వ్యాపారులు డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో విభేదాలు రావచ్చు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు.
ఈ వారం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారాలలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ప్రయాణాలు విజయవంతంగా సాగుతాయి.
ఈ వారం మకర రాశి వారికి క్రమశిక్షణ చాలా అవసరం. ఉద్యోగంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆలోచించి ముందుకు సాగాలి. వ్యాపారాలలో స్థిరమైన ఎదుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. దాంపత్య జీవితం సాధారణంగా ఉంటుంది. కానీ పరస్పర అవగాహన అవసరం.
ఈ వారం కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో కొత్త ప్రణాళికలు అమలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది.
ఈ వారం మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.