Yearly Numerology: 2026లో ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎలా ఉంటుందో తెలుసా?

Published : Dec 02, 2025, 03:03 PM IST

Yearly Numerology:పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి భవిష్యత్తు, స్వభావం, వ్యక్తిత్వం పూర్తిగా తెలుసుకోవచ్చు. మరి.. నెంబర్ 1 కి చెందిన వారి జీవితం 2026లో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.... 

PREV
14
2026 Horoscope

న్యూమరాలజీ ప్రకారం, ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి 2026లో ఆరోగ్యం, ధైర్యం, డబ్బు, బలం, ఆనందం, పిల్లలు, కెరీర్, పని, వ్యాపారానికి సంబంధించి కొత్త, ప్రత్యేక మార్పులను తెస్తుంది.

24
2026లో నెంబర్ 1 కి చెందిన వారి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే....

ఈ తేదీల్లో జన్మించిన వారికి 2026 ఆరోగ్యం పరంగా చాలా అనుకూలంగా ఉంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే.... ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అనారోగ్య ఆహారాలు తీసుకుంటే... కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... కంటికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి.... తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

34
ఆర్థిక పరిస్థితి...

ఈ తేదీల్లో పుట్టిన వారికి 2026 ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఉద్యోగం, వ్యాపారం ఏది చేసినా విజయం సాధిస్తారు. దీని కారణంగా ఊహించని లాభాలు పొందుతారు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆదాయ మార్గాలు కొత్తవి చాలా వస్తాయి. ఈ మార్గాలను వాడుకుంటే... మరింత ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారాన్ని కూడా మరింత విస్తరించగలరు. వీరు ఏ రంగానికి చెందిన వారు అయినా... ఈ ఏడాది డబ్బుకు లోటు ఉండదు.

జనవరి, ఫిబ్రవరి, మార్చి, మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ , డిసెంబర్ నెలల్లో కెరీర్, డబ్బు లేదా పని, వ్యాపారం మొదలైన వాటికి సంబంధించి మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. కాబట్టి, ఏప్రిల్, జూన్ లేదా జూలై నెలల్లో మీరు ప్రతికూల ఫలితాలను పొందవచ్చు. ఈ సంవత్సరం గ్రహాలు , వాహనాలకు సంబంధించి మీరు పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో వాహనాలకు సంబంధించి ఖర్చులు తలెత్తవచ్చు. భూమి, ఇంటికి సంబంధించిన పనిలో పురోగతి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఈ కాలంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది.

44
ప్రేమ జీవితం

వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధం పరంగా నంబర్ 1 ఉన్నవారికి 2026 సంవత్సరం కూడా సాధారణంగా ఉంటుంది. వీరి ఎక్కువ ఫోకస్ కెరీర్ పురోగతి, డబ్బు సంపాదనపై పెడతారు. దీని కారణంగా... కుటుంబానికి ఎక్కువ టైమ్ ఇవ్వలేకపోవచ్చు. దీని వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. పని, కుటుంబం రెండూ బ్యాలెన్స్ చేసుకునే సామర్థ్యం ఉండాలి.

కెరీర్...

ఈ సంవత్సరం కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది. విద్యార్థులకు చదువుకు సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కష్టపడి చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు. అదేవిధంగా, నంబర్ 1 ఉన్న వ్యక్తులు వారి శారీరక సామర్థ్యం ఆధారంగా ఈ కాలంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories