కెరీర్, వ్యాపారం...
నెంబర్ 2 కి చెందిన వ్యక్తులకు 2026 ఆకస్మిక విజయాలు, ఆర్థిక లాభాలు పొందుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది శుభ కాలం. ముఖ్యంగా విద్య, రాజకీయాలు, పాలు, పండ్లు, పూల వ్యాపారం, ప్రయాణాలు వంటి రంగాల్లో వ్యాపారం చేసే వారికి ఈ ఏడాది బాగా కలిసొస్తుంది.
ప్రేమ, వైవాహిక జీవితం...
2026లో ప్రేమ జీవితం , వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భావోద్వేగ సున్నితత్వం, పనిలో ఒత్తిడి కారణంగా భాగస్వామితో అపార్థాలు, వాగ్వాదాలు జరగవచ్చు. అయితే ఇంట్లో జరిగే శుభకార్యాల వలన ఆనందం, శాంతి లభిస్తాయి.
శుభమైన నెలలు — జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్
జాగ్రత్తగా ఉండాల్సిన నెలలు — ఏప్రిల్, మే, జూలై, ఆగస్టు