Zodiac signs: జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులకు చెందిన స్త్రీలు తరచుగా తమ భర్తలతో , కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూనే ఉంటారు. ఇంట్లో మనశ్శాంతి అనేదే ఉండదు.
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుంచుకోదగిన సంతోషకరమైన క్షణం. అందుకే.. అందరూ పెళ్లిని చాలా సంతోషంగా, గ్రాండ్ గా జరుపుకుంటారు. కానీ, పెళ్లి తర్వాత మాత్రం చాలా మందికి సంతోషం అనేదే ఉండదు. గొడవలు పడుతూనే ఉంటారు. అలా గొడవలు జరగడానికి భార్య వ్యక్తిత్వం కూడా కారణం కావచ్చు.మరీ ముఖ్యంగా, కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు పెళ్లి తర్వాత తరచూ భర్తతో, కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూనే ఉంటారు. భర్తతో ప్రతి నిమిషం కీచులాడుతూనే ఉంటారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం...
25
1.మేష రాశి...
మేష రాశిని కుజుడు పాలిస్తాడు. దూకుడు, ఉత్సాహం, కోపం, అధిక శక్తి అంగారకుడి లక్షణాలు. అందువల్ల, మేష రాశి స్త్రీలు కూడా చాలా శక్తివంతంగా ఉంటారు. వారి ఉత్సాహభరితమైన, దూకుడు స్వభావం కారణంగా వారు తమ భర్తతో గొడవలు పడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తామే విజయంలో సాధించాలని అనుకుంటారు. ప్రతి వాదనలోనూ తామే నెగ్గాలి అని అనుకుంటారు. అందుకే.. ప్రతి విషయంలోనూ భర్తతో గొడవ పడుతూ ఉంటారు. కానీ.. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే... ఎంత కోపం వచ్చినా, ఎంత గొడవపడినా.. కాసేపటికి మర్చిపోయి... మళ్లీ నార్మల్ అయిపోతారు. వేరే పనికి వెళ్లిపోతారు.
35
2.సింహరాశి
సింహరాశి ని సూర్యుడు పాలిస్తాడు. ఈ రాశికి చెందిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో ఆధిపత్య లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా.. అందరిపై తామే పెత్తనం చేయాలని అనుకుంటారు. ఫలితంగా గొడవలు పడుతూ ఉంటారు. అంతేకాదు... తమ భాగస్వామి నుంచి సరైన గుర్తింపు రానప్పుడు కూడా వీరికి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని గొడవ రూపంలో చూపిస్తూ ఉంటారు.
వృశ్చికరాశిని అంగారక గ్రహం పాలిస్తూ ఉంటుంది. వీరికి కూడా సహజంగానే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా... ఈ రాశి అమ్మాయిలు... తమ భర్తపై కోపం చూపిస్తూనే ఉంటారు. తమదే ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటూ ఉంటారు. భర్త ఎప్పుడూ తమ మాటే వినాలనే అభిప్రాయం వీరికి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా తమ నమ్మకాన్ని ఉల్లంఘించారని వారు భావిస్తే, వారు వెంటనే ఘర్షణల్లో పాల్గొంటారు. వారు ప్రతిదానిలోనూ నిజాయితీగా , నమ్మకంగా ఉండాలని భావిస్తారు. కొంచెం తమకు అనుకూలంగా లేకపోయినా గొడవకు దిగుతారు.
55
4.మకర రాశి...
మకరరాశి ని శని గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారికి శ్రమశిక్షణ చాలా ఎక్కువ. ఈ రాశి అమ్మాయిలు బలమైన భావాలను కలిగి ఉంటారు. వారు బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ, సంబంధాలలో వారు తీవ్ర విధేయత , క్రమశిక్షణను ఆశిస్తారు. వారి మొండి స్వభావం కారణంగా, వారు పోరాటంలో కూడా దృఢంగా ఉంటారు. ఒకసారి గొడవ మొదలైంది అంటే... వారు దాని నుండి వెనక్కి తగ్గరు. ఈ రాశి అమ్మాయిలు భర్తతో నిత్యం గొడవలు పడుతూ ఉంటారు.