Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కష్ట జీవులు..కుటుంబాన్ని తమ భుజాలపై మోస్తారు

Published : Apr 24, 2026, 07:18 AM IST

Birth Date: మీరు పుట్టిన తేదీ మీ వ్యక్తిత్వాన్ని మార్చేయగలదు.ఇతరులతో కలిసి జీవించే విధానాన్ని కూడా మారుస్తుంది. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుటుంబ బాధ్యతను భుజాలపై మోస్తారు. వెన్నెముకలా నిలుస్తారు.ఆ తేదీలేంటో చూద్దాం..

PREV
14
1.నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ అమ్మాయిలు జీవితంలో చాలా బాధ్యతగా ఉంటారు.ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఏ పని చేసినా కరెక్ట్ గా ఉంటుందని అందరూ నమ్ముతారు. అందుకే.. అన్ని బరువు, బాధ్యతలు వీరి మీదే వేస్తారు. కుటుంబంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా..వీరికే చెప్పుకుంటారు. ఎవరికి ఏం కావాలో వీరికి బాగా తెలుసు.

24
నెంబర్ 5..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైనవారు. ఏ విషయాలు అయినా చాలా త్వరగా నేర్చుకుంటారు. మానసికంగా చాలా బలంగా ఉంటారు. కుటుంబానికి చాలా అండగా నిలుస్తారు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడంలో ముందుంటారు. వీరు ఎలాంటి కష్ట సమయాల్లో అయినా చాలా ప్రశాంతంగా ఉండి.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

34
నెంబర్ 8...

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కూడా చాలా బలంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. కానీ, వీరు కొంచెం కూడా బాధపడరు, భయపడరు. వీరి దగ్గర ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. తమ కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టాన్ని అయినా వీరు ఎదురించగలరు.

44
నెంబర్ 9...

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా దయతో ఉంటారు. ఇతరులకు కూడా ఎప్పుడూ సహాయం చేయడంలో ముందుంటారు. వీరు కుటుంబం కోసం ప్రాణాలు అయినా ఇస్తారు. చాలా ధైర్యవంతులు. కుటుంబ బరువు బాధ్యతలను భుజాలపై మోస్తారు. ఎవరికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వీరు అండగా నిలుచుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories