Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి!

Published : Apr 24, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 24.04.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమవుతాయి. అన్ని రంగాల వారికి అనుకూలం. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి.

413
మిథున రాశి ఫలాలు

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

ఇంట్లో విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పని భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

613
సింహ రాశి ఫలాలు

స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు

సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

913
వృశ్చిక రాశి ఫలాలు

సంతాన శుభకార్యాలకు సంబంధించి విషయాలు చర్చిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలం. ప్రయాణాలు, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. దూర ప్రాంత బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుంచి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.

1213
కుంభ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో ఒక విషయంలో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుచేసుకొని బాధపడతారు. శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. దాయదులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories