Birth date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల భవిష్యత్తును బంగారు కలంతో రాసాడు ఆ బ్రహ్మ

Published : Apr 23, 2026, 01:33 PM IST

Birth date: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ప్రకారం ఆ వ్యక్తి జీవితం ఆనందంగా సాగుతుందా, బాధలతో ఉంటుందా? తెలుసుకోవచ్చు. కొన్ని తేదీలలో జన్మించిన అమ్మాయిలా విధిని భవిష్యత్తును మాత్రం బ్రహ్మ నిజంగానే బంగారు కలంతో రాసాడని చెప్పుకోవచ్చు. 

PREV
14
భర్తకు రజో యోగాన్ని ఇచ్చే అమ్మాయిలు

జ్యోతిషంలో సంఖ్యా శాస్త్రం ఒక ముఖ్యమైన భాగం. దీని ప్రకారం ఒక వ్యక్తి జన్మించిన సంఖ్యను బట్టి అతని జీవితాన్ని అంచనా వేయవచ్చు. న్యూమరాలజీ చెబుతున్న ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన అమ్మాయిలు అదృష్టవంతులు. వారు తమ భర్తలకు రజో యోగాన్ని తీసుకువస్తారు. ఈ అమ్మాయిల జీవితాన్ని ఆ బ్రహ్మ బంగారు కలంతో రాసాడనే చెప్పుకోవచ్చు. వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటారు. భర్తతో పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతారు. ఆ తేదీలు ఏవో తెలుసుకోండి.

24
ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు

ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారి అమ్మాయిలా రాడిక్స్ సంఖ్య 4 అవుతుంది. నాలుగు సంఖ్యకు అధిపతి రాహువు. జ్యోతిషశాస్త్రంలో రాహువును ఆకస్మిక సంఘటనలు జరిగేందుకు కారకుడిగా చెప్పుకుంటారు. అందుకే నాలుగవ సంఖ్య గల అమ్మాయిలు జీవితంలో ప్రతిదీ ఆకస్మికంగా జరుగుతుంది. రాత్రికి రాత్రే వారు అదృష్టవంతులుగా మారిపోతారు. ఈ నాలుగు నెంబరు గల స్త్రీలు తమ భర్తకు అదృష్టాన్ని తెచ్చి పెడతారు. ఊహించిన ఫలితాలను భర్తకు అందిస్తారు. వీరిని పెళ్లి చేసుకున్న పురుషుడు అదృష్టం అకస్మాత్తుగా మారిపోతుంది. భర్తల వృత్తిలో ఊహించని లాభాలు కలుగుతాయి.

34
చాలా ధైర్యవంతులు

ఇక ఈ సంఖ్య గల అమ్మాయిలు చాలా ధైర్యవంతులు. నిర్భయంగా జీవిస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన కూడా గాబరా పడరు. ఆందోళన చెందరు. భర్తలు కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి అండగా నిలుస్తారు. వినూత్నంగా ఆలోచించి వారికి మార్గ నిర్దేశం చేస్తారు. అమ్మాయిలది కష్టపడి పని చేసే తత్వం. అందుకే వారి జీవితంలో ఎప్పటికీ ఓటమిని చూడరు. తాము చేయాలనుకున్నది సాధించి తీరుతారు.

44
సరైన నిర్ణయం తీసుకుంటారు

ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు నిర్ణయాలలో కూడా చాలా చక్కగా విశ్లేషించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భావోద్వేగ పరంగా ఆలోచించరు. అలాగే సంబంధాలను నిలబెట్టుకోవడంలో ముందుంటారు. తమ అనుకున్న వారిని జీవితాంతం కాపాడుకుంటారు. ఎవరైనా తమను మోసం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఎప్పటికీ వారిని క్షమించరు. ఈ అమ్మాయిలకు స్వతంత్ర భావాలు ఎక్కువ. తమకు నచ్చినట్టే జీవితాన్ని గడపాలనుకుంటారు. పాత సాంప్రదాయాలను పాటించడానికి ఇష్టపడరు. వీరి పరిశీలనా శక్తి కూడా చాలా ఎక్కువ. అందుకే మీరు అనేక రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే వీరిని మొండి వారిగానే చెప్పుకోవాలి. దీనివల్ల ఇతరులకు ఒక్కోసారి ఇబ్బంది కలగవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories