Bad Sign: మంచి శకునం, అపశకునాలను నమ్మేవారు చాలా మంది ఉంటారు. మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా అది మంచో, చెడో చెప్పగలం. కొన్ని శకునాలు మనకు రాబోయే దురదృష్టాన్ని కూడా తెలుసుకోవచ్చు. మరి, అలాంటి శకునాలు చూద్దాం..
అప్పుడప్పుడు ఇంట్లో పాలు విరిగిపోతూ ఉంటాయి. అది చాలా కామన్. కానీ, రెగ్యులర్ గా పాలు విరిగిపోతున్నాయి అంటే మాత్రం దానిని అశుభ సంకేతంగా పరిగణిస్తారు. శకునాల ప్రకారం, ఇంట్లో తరచూ పాలు విరిగిపోతే భవిష్యత్తులో జరిగే నష్టం లేదా దురదృష్టానికి సంకేతం.
24
ట్యాప్ నుంచి వాటర్ లీక్ అవుతున్నాయా?
మన ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్ నుంచి రెగ్యులర్ గా వాటర్ లీక్ అవ్వడం కూడా మంచి శకునం కాదు. దీనిని ఆర్థిక నష్టానికి సూచనగా పరిగణిస్తారు. అదేవిధంగా బాత్రూమ్ లో ఖాళీ బకెట్ ఎప్పుడూ ఉంచకూడదు. దీనిని కూడా అశుభంగా పరిగణిస్తారు. ఖాళీ బకెట్ ఆర్థిక సంక్షోభాన్ని తెస్తుంది. మానసిక ఒత్తిడి పెంచుతుంది. అందుకే.. ఖాళీ బకెట్ కాకుండా.. నీటితో నింపి ఉంచాలి. అప్పుడు శుభప్రదంగా పరిగణిస్తారు.
గాజు పగలడం...
శకునాలలో, అద్దం లేదా గాజుతో చేసిన ఏదైనా వస్తువు పగలడం కూడా అశుభంగా పరిగణిస్తారు. ఇది పేదరికం, అశాంతికి సంకేతంగా పరిగణిస్తారు. ఇంట్లో ఏదైనా గాజు వస్తువు పగిలిపోతే, దానిని వెంటనే బయట పడేయాలి.
34
కత్తి చేజారి పడిపోతే....
ఒక కత్తి అకస్మాత్తుగా మీ చేతిలో నుండి పడిపోతే, అది కూడా అశుభమని భావిస్తారు. దీనితో పాటు, నిప్పు దగ్గర కత్తిని ఉంచుకోవడం కూడా అశుభమని భావిస్తారు. కత్తులు , ఫోర్కులు వంటి వస్తువులను ఒకదానిపై ఒకటి ఉంచడం వల్ల కుటుంబంలో గొడవలు పెరుగుతాయని నమ్ముతారు. కాబట్టి, ఎల్లప్పుడూ అలాంటి వాటిని జాగ్రత్తగా ఉంచండి.
ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తుమ్మడాన్ని కూడా అశుభమని భావిస్తారు. ఇది ఒకరి పనిలో అడ్డంకులను కలిగిస్తుందని , ఆశించిన ఫలితాలను పొందకపోవచ్చని నమ్ముతారు. అందుకే ఎవరైనా తుమ్మినప్పుడు వెంటనే బయటకు వెళ్లకూడదు. కాసేపు ఆగి, కూర్చొని.. వాటర్ తాగి, అప్పుడు బయటకు వెళ్లడం మంచిది.