Birth Date:ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరినైనా ఆకర్షించగలరు..!

Published : Mar 13, 2025, 10:31 AM IST

ఈ న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరినైనా ఇట్టే తమ ఆకర్షణలో పడేయగలరు.

PREV
14
Birth Date:ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరినైనా ఆకర్షించగలరు..!


న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ప్రకారం మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మాత్రమే కాదు...మన వ్యక్తిత్వం గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరినైనా ఇట్టే తమ ఆకర్షణలో పడేయగలరు. కొంత మందిలో సహజంగా అయస్కాంతత్వం ఉంటుంది. వారికి తెలీకుండానే.. ఇతరులను వారు ఆకర్షించగలరు. మరి, ఆ తేదీలేంటో చూద్దాం..

24

3, 12, 21, 30.. ఏ నెలలో అయినా ఈ నాలుగు తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇతరులను చాలా ఈజీగా ఆకర్షించగలరు.ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సహజంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. చాలా సహజంగా మంచిగా మాట్లాడగలరు. తమ చుట్టూ ఉండే అందరూ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వారు మాట్లాడే తీరు, వ్యవహరించే తీరుకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అందుకే.. వీరు తమ చుట్టూ ఉన్నవారందరికీ ఫేవరేట్ పర్సన్ అయిపోతారు.
 

34


5, 14,23 తేదీలలో జన్మించిన వారు కూడా అందరి దృష్టిని ఆకర్షించగలరు.వీరు తరచుగా పార్టీలకు ప్రాధాన్యత ఇస్తారు. సాహసోపేతమైన స్ఫూర్తిని కలిగి ఉంటారు, ఇతరులు దీనిని అధిగమించలేరు. వారు ఎల్లప్పుడూ కొత్త విషయాలను ప్రయత్నించడానికి, కొత్త వ్యక్తులను కలవడానికి ,కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉంటారు. వారి ధైర్యం ,సహజత్వం వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. అందుకే, వారు ఎక్కడకు వెళ్లినా.. ఎదుటివారు వీరి ఆకర్షణలో పడిపోవాల్సిందే.

44

7, 16 ,25 తేదీలలో పుట్టిన అమ్మాయిలు కూడా ఇతరులను చాలా సులభంగా ఆకర్షించగలరు. వీరు తొందరగా బయటకు రావడానికి, అందరిలోనూ స్పెషల్ గా కనిపించాలని అనుకోరు. కానీ,వారికి తెలీకుండానే ఆకర్షించేస్తారు.వీరు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. వీరిని ఒక్కసారి కలిసిన వారు.. మళ్లీ మళ్లీ కలవాలని కోరుకుంటారు. 

click me!

Recommended Stories